'గజ' మూవీ 'అల్లకల్లోలంగా' సాంగ్ విడుదల

ABN , Publish Date - Sep 03 , 2026 | 06:59 PM

సతీశ్‌ జై, ఫర్నాజ్ శెట్టి జంటగా నటించిన సినిమా 'గజ'. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా 'అల్లకల్లోలంగా' అనే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.

Gaja movie song launch

చలమలశెట్టి సునీల్ సమర్పణలో సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో డా. మైత్రి శరణ్ నిర్మించిన చిత్రం ‘గజ’. సతీష్ జై దీనికి దర్శకత్వం వహించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాని మైత్రి మూవీస్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో గురువారం అల్లకల్లోలంగా అనే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో సాయి రాజేశ్‌ మాట్లాడుతూ, 'ఈ సినిమా టీజర్ ఇంప్రెసివ్‌గా అనిపించింది. నాకు సతీష్‌తో ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా ఈ సినిమాని వదల్లేదు. కష్టపడి ఈ స్థాయికి తీసుకు వచ్చాడు. రామ్ మిర్యాల వాయిస్ అంటే నాకు ఇష్టం. మణిశర్మ గారిని, రామ్ మిర్యాలని కలిపి క్రెడిట్ తీసుకోవాలని అనుకున్నాను. కానీ ఆల్రెడీ సతీష్ ఆ క్రెడిట్ తీసుకున్నాడు. మళ్లీ మేం ముగ్గురం కలిసి ఓ గొప్ప పాటను చేయాలని అనుకుంటున్నాను. ఫర్నాజ్ గారు తెలుగులో చక్కగా మాట్లాడారు. మణిశర్మ గారితో నాకు ఎన్నో బెస్ట్ మెమోరీస్ ఉన్నాయి. ఇకపై నేను మణి సార్‌తోనే ట్రావెల్ చేస్తాను. ఆయన ట్రాక్ క్వాలిటీని కూడా ఎవ్వరూ బీట్ చేయలేరు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


సతీష్ జై మాట్లాడుతూ, 'ఈ సినిమా కథను ముందుగా మిట్టపల్లి గారికి చెప్పాను. మణిశర్మగారు మ్యూజిక్ అని చెప్పడంతో మిట్టపల్లి గారు మరింత ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమాకి, నాకు మణిశర్మ గారు బ్యాక్ బోన్‌లా నిలిచారు. ఆయన్నుంచి నేను క్రమశిక్షణ, డెడికేషన్ గురించి తెలుసుకున్నాను. సాయి రాజేష్ గారు ఎప్పుడూ ఓ ఫ్రెష్ కంటెంట్‌ని తీసుకుంటారు. సాయి రాజేష్ గారికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంటుంది. ఈ రోజు మా కోసం ఆయన రావడం సంతోషంగా ఉంది. ఫర్నాజ్ మంచి నటి. ఈ సినిమాకి ఫర్నాజ్ హీరో. కమర్షియల్ అంశాలతో పాటు సెల్యూట్ కొట్టేలా మంచి మెసెజ్, ఎమోషన్ కూడా ఉంటుంది. క్లైమాక్స్ చూసి కంటతడి పెట్టుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు. నా భార్య మైత్రి శరణ్ నాకంటే చాలా ఫేమస్. ఆమె నాకు స్పూర్తి. సెవెన్ హిల్స్ సతీష్ నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. మా సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. మణిశర్మ మాట్లాడుతూ, 'మా సతీష్ ‘గజ’ సినిమాని ఎన్నో కష్టాలు, సవాళ్లని ఎదుర్కొని చేశాడు. మూవీ అద్బుతంగా వచ్చింది. ‘అల్లకల్లోలంగా’ ట్యూన్ అద్భుతంగా కుదిరింది. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు.


నిర్మాత మైత్రి శరణ్ మాట్లాడుతూ, 'మా సినిమా టీజర్‌ అందరికీ నచ్చింది. అంతటి ఆదరణ లభిస్తుందని మేం కూడా ఊహించలేదు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్నది ఆడియెన్స్ చూడటం లేదు. మాకోసం ఈ రోజు సాయి రాజేష్ గారు రావడం, సాంగ్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మణిశర్మ గారితో పని చేయడం మా కల. అసలు ఆయన మాకు ఓకే చెప్తారా? అని అనుకున్నాం. ఆయన ఇచ్చిన బీజీఎం, పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. మిట్టపల్లి గారు మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. మా సినిమాని థియేటర్లో చూసి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఫర్నాజ్ శెట్టి మాట్లాడుతూ, 'గజ’ సినిమాలో భాగం అవ్వడం నాకు ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ మూవీలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ, నాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. ఈరోజు మాకోసం వచ్చిన సాయి రాజేష్ గారికి ధన్యవాదాలు. సినిమాని ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు. సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ, 'ఈ సినిమాని చూశాను. మూవీలో కంటెంట్ ఉంటేనే ఆడియెన్స్ చూస్తారు. ‘అల్లకల్లోలం’ పాటతో మా సతీష్ అల్లకల్లోలం సృష్టిస్తాడు’ అని అన్నారు. లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ, 'ఇందులో మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చిన జై అన్నకి థాంక్స్. మణిశర్మ గారి మ్యూజిక్‌ వింటూ పెరిగాం. ఆయన ట్యూన్స్‌లో మా టీన్స్ గడిచింది. ఆయన సంగీతానికి పాటలు రాసే అవకాశం రావడం నా అదృష్టం. నా కల నెరవేరింది’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

హీరోయిజం కాదు.. ఇప్పుడు దర్శకులదే హవా

‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ డేట్ ఫిక్స్.. వర్కవుట్ అవుతుందా

Pakeezah: అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో రీస్టోర్డ్ వెర్షన్ ప్రీమియర్‌

Updated Date - Sep 03 , 2026 | 07:02 PM