సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రధాన పాత్రలన్నింటితో.. ‘ఫీల్ మై లవ్’ స్పెషల్ పోస్టర్ వైరల్

ABN, Publish Date - Sep 16 , 2026 | 04:28 PM

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న తాజా ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఫీల్ మై లవ్’. ఈ మూవీ నుంచి విడుదలైన తాజా పోస్టర్ వైరల్ అవుతోంది.

Feel My Love Poster

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న తాజా ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఫీల్ మై లవ్’ (Feel My Love). ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి హరి ప్రకాష్ ఎం కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నేటి యూత్‌ను ఆకట్టుకునేలా స్వచ్ఛమైన ప్రేమ, చక్కటి వినోదం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. గతంలో విడుదలైన టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా, తాజాగా వినాయక చవితి పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ (Feel My Love Movie Special Poster)ను విడుదల చేసింది.


సినిమాలోని ప్రధాన తారాగణాన్ని పరిచయం చేస్తూ డిజైన్ చేసిన ఈ స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామితో పాటు చిత్రంలో కీలక పాత్రలు పోషించిన మధుసూదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంకల లుక్స్‌ను ఇందులో రివీల్ చేశారు. చెన్నై, పుదుచ్చేరి, మున్నార్, కొడైకెనాల్ వంటి సుందరమైన ప్రకృతి లొకేషన్లలో చిత్రీకరించిన విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.


ఈ చిత్రానికి ఎం.ఎస్. సతీష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రాజరవివర్మ ఎస్ - బాలసుబ్రహ్మణ్యన్ జి ద్వయం సంగీతాన్ని సమకూర్చారు. అజయ్ మనోజ్ ఎడిటింగ్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర ఆడియోను అత్యంత గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆ వెంటనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రమోషనల్ ఈవెంట్లను నిర్వహించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

ఇవి కూడా చదవండి!

బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న సూరి, సుహాస్.. ‘మండాడి’ కలెక్షన్ల సునామీ

నాడు అడుగేస్తే చ‌ప్ప‌ట్లు.. నేడు జైలులో ఊచలు

'కిల్లర్' మేకర్స్ సూపర్ షీ ఛాలెంజ్‌!

Updated Date - Sep 16 , 2026 | 04:28 PM