సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఫౌజీ’లో ప్రభాస్ మదర్‌గా ఎవరో తెలుసా..

ABN, Publish Date - Aug 01 , 2026 | 07:48 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’. ఈ సినిమాలో ప్రభాస్ మదర్ పాత్రకు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

Fauzi Movie Poster

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi). 1970ల నాటి యుద్ధ నేపథ్యంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.


ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. అలనాటి అందాల తార జయప్రద (Jayaprada) ఈ చిత్రంలో ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె కూడా ఇటీవల ఓ వేదికపై తెలియజేశారు. ఈ సినిమాలో ఆమె ప్రభాస్ తల్లి పాత్రను పోషిస్తున్నారనేలా ఇప్పుడు సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ పాత్రకు సంబంధించిన లెన్త్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుందని, ముఖ్యంగా ప్రభాస్ - జయప్రద మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ఎక్కువ సినిమాలు చేసిన కథానాయికల్లో జయప్రద ఒకరు. అప్పట్లో ఈ హిట్ కాంబినేషన్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి. ‘మధుర స్వప్నం, సీతారాములు, అగ్ని పూలు, యుద్ధం, రంగూన్ రౌడీ, కురుక్షేత్రం, ప్రళయ రుద్రుడు, తల్లి కొడుకుల అనుబంధం, సర్దార్, అడవి సింహాలు, విశ్వనాథ నాయకుడు’ వంటి చిత్రాలతో ఈ జంట ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ముఖ్యంగా 1986లో వచ్చిన ‘తాండ్ర పాపారాయుడు’లో వీరిద్దరి నటనను అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేరు. అందుకే వీరిది టాలీవుడ్‌లో ఒక లక్కీ పెయిర్‌గా పేరుగాంచింది. ఇన్ని దశాబ్దాల తర్వాత కృష్ణంరాజు వారసుడు ప్రభాస్‌కు తల్లిగా జయప్రద నటించడం విశేషం. ఒకవేళ కృష్ణంరాజు ఇప్పుడు ఉండి ఉంటే ఈ సన్నివేశాలు చూసి ఎంతగానో సంతోషించేవారని సినీ విశ్లేషకులు గుర్తుచేసుకుంటున్నారు.


మరోవైపు అభిమానులను అలరించేందుకు మేకర్స్ ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆగస్టు 14, లేదా 15న ఈ చిత్రం నుంచి ఒక ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ క్యారెక్టర్ లుక్‌తో పాటు సినిమా విజువల్ టోన్, యుద్ధ నేపథ్యాన్ని ఆకట్టుకునేలా చూపించే అవకాశం ఉందట. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చివరి షెడ్యూల్ పనులను వేగవంతం చేశారట. ప్రభాస్ ఈ వారంలోనే ఈ నాన్‌స్టాప్ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నారని టాక్. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ విజువల్ వండర్, డిసెంబర్ 3న థియేటర్లలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!.

ఇవి కూడా చదవండి:

‘వారణాసి’ తర్వాత జక్కన్న ప్లాన్ ఏంటి? చిన్న సినిమానా.. లేక

కొరియాలో షూట్ చేసినా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు: మెగా ప్రిన్స్

Lenin OTT: అయ్యగారి సినిమా ఈసారి ఆలస్యం కాకుండానే ఓటీటీకి..

Updated Date - Aug 01 , 2026 | 07:48 PM