కొరియాలో షూట్ చేసినా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు: మెగా ప్రిన్స్

ABN , Publish Date - Aug 01 , 2026 | 04:47 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త అవతార్‌లో కనిపించనున్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాకు సంబంధించిన విషయాలను తెలియజేశారు.

Korean Kanakaraju Movie Team

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) సరికొత్త అవతార్‌లో కనిపించనున్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). ఈ సినిమాపై రోజురోజుకీ క్రేజ్ పెరుగుతోంది. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ హారర్ కామెడీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలను మరింత పెంచేశారు. హారర్, కామెడీ, యాక్షన్, ఎమోషన్‌లతో వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది.


ఈ ట్రైలర్‌ లాంచ్‌ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో జరిగిన మీడియా మీట్‌లో వరుణ్ తేజ్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించాలని ఈ సినిమా చేశాం. ఆగస్ట్ 7న థియేటర్లలో ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. మా టీమ్ అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్యూ చెబుతున్నాను. ఈ సినిమా మా అందరికీ ఒక బ్యూటిఫుల్ జర్నీ. ప్రేక్షకులకు కూడా అదే స్థాయిలో మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే అందరం ప్రయత్నించాం.


ఈ సినిమా కొరియాలో షూట్ చేసినప్పటికీ.. భాష విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. ఇందులో నేను రెండు పర్సనాలిటీస్‌లో కనిపిస్తాను. డైరెక్టర్‌తో కలిసి ప్రతి క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేదానిపై మంచి హోంవర్క్ చేశాం. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కథతో చాలా నేచురల్‌గా ట్రావెల్ అవుతుంటాయి. ఏదీ బలవంతంగా చొప్పించినట్లుగా ఉండవు. ఇది పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్. ఒకే బాడీలో రెండు ఆత్మలు ఉంటే ఎలాంటి ఛాలెంజెస్ వుంటాయనేదే కథాంశం. పెర్ఫార్మెన్స్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటించాను. డైరెక్టర్ రాసుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి నా వంతు ప్రయత్నించాను. ఈ సినిమా చేయడం నటుడిగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

Lenin OTT: అయ్యగారి సినిమా ఈసారి ఆలస్యం కాకుండానే ఓటీటీకి..

జూలైలో అనువాద చిత్రాల హవా...

అంజలీదేవి నుంచి సాయి పల్లవి వరకు.. వెండితెర సీతమ్మల జర్నీ!

Updated Date - Aug 01 , 2026 | 04:48 PM