Vijay Devarakonda: అందరూ హిట్ కొడుతున్నారు.. నువ్వెప్పుడు కొడతావ్ అన్నా
ABN, Publish Date - Aug 25 , 2026 | 06:53 PM
టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు.
టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి చిత్రం విజయ్‌ను రాత్రికి రాత్రే స్టార్ హీరోను చేయడమే కాకుండా, యూత్‌లో విపరీతమైన రౌడీ ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ట్యాక్సీవాలా కూడా విజయ్ కు మంచి విజయాన్ని అందించింది.
అయితే కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో విజయ్ దేవరకొండకు వరుస ప్లాప్‌లు ఎదురయ్యాయి. నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలతో వచ్చిన లైగర్ అయితే విజయ్ కెరీర్ కి పెద్ద బ్రేక్ వేసింది.ఈ సినిమా ఇచ్చిన పరాజయం నుంచి విజయ్ ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా వచ్చి నాలుగేళ్ళు అవుతోంది. ఆ తరువాత ది ఫ్యామిలీ స్టార్, ఖుషి, కింగ్‌డమ్ సినిమాలు చేశాడు. ఏ ఒక్కటి కూడా విజయ్ కి హిట్ ని ఇవ్వలేకపోయాయి.
ఇక ఈ ఏడాది టాలీవుడ్ లో వరుస ప్లాప్ లతో బాధపడుతున్న అందరు హీరోలు హిట్ ని అందుకున్నారు. లెనిన్ తో అఖిల్ అక్కినేని, కొరియన్ కనకరాజు తో వరుణ్ తేజ్.. ఇప్పుడు ఇరుముడితో రవితేజ.. మంచి విజయాలను అందుకున్నారు. దీంతో అందరి చూపు ప్రస్తుతం విజయ్ దేవరకొండ మీదనే ఉంది. విజయ్ దేవరకొండ కూడా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి చాలానే కష్టపడుతున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఒకటి రణబాలి. రెండు రౌడీ జనార్ధన. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. వీటిలో ముందుగా రణబాలి చిత్రం థియేటర్లలోకి రానుంది. మరి ఈ సినిమాతో విజయ్ కంబ్యాక్ గట్టిగా ఇస్తాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.