Jana Nayagan: సెన్సార్ రిపోర్ట్... నిర్మాణ సంస్థ స్పందన
ABN , Publish Date - Jul 07 , 2026 | 06:06 PM
జన నాయగన్’ చిత్రం రకరకాల కారణాల వల్ల వాయిదా పడింది. తరచూ వార్తల్లో నిలుస్తోంది. హీరో రాష్ట్రానికి సీఎం అయినా కానీ ఈ చిత్రానికి గల సమస్యలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. తాజాగా ఈ సినిమా సెన్పార్ పూర్తయిందని ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారని వార్తలు వైరల్ అయ్యాయి.
తమిళనాడు సీఎం విజయ్ హీరోగా నటించిన చిత్రం ‘జన నాయగన్’. హెచ్ వినోద్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావలసిన ఈ చిత్రం రకరకాల కారణాల వల్ల వాయిదా పడింది. తరచూ వార్తల్లో నిలుస్తోంది. హీరో రాష్ట్రానికి సీఎం అయినా గానీ ఈ చిత్రానికిగల సమస్యలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. తాజాగా ఈ సినిమా సెన్పార్ పూర్తయిందని ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారని వార్తలు వైరల్ అయ్యాయి. కట్స్‌తో కూడిన ఓ సర్టిఫికెట్ కూడా సోషల్ మీడియాలో తిరిగింది.
దీనిపై తాజాగా నిర్మాణ సంస్థ స్పందించింది. 'సోషల్ మీడియాలో తిరుగుతోన్న సెన్సార్ సర్టిఫికెట్ ఫేక్. బోర్డ్ సభ్యులు సినిమా చూసి కొన్ని మార్పులు చెప్పారు. ఆ మార్పులు చేసే పనిలో ఉన్నాం. ఆ పని అయ్యాక మళ్లీ సెన్సార్‌కు పంపుతాం. అవన్నీ పూర్తి చేసి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం’ అని నిర్మాణ సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
RGV: ‘సత్లుజ్’ను చూడాలి.. చూపించాలి.. చర్చించాలి
పాలిటిక్స్‌లోకి ధనుష్.. ఈ హడావుడి అంతా అందుకేనా?
అక్కినేని వారబ్బాయికి.. నందమూరి వారసుని 'మాట సాయం'!