‘ఎపిక్’ ఆనంద్ దేవరకొండ ఒరిజినల్ స్టోరీనా?

ABN , Publish Date - Apr 29 , 2026 | 07:52 PM

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం ఒక హృద్యమైన అనుభూతిని అందిస్తుందని ప్రామిస్ చేస్తోంది.

Anand Deverakonda

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ (EPIC – First Semester) నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం ఒక హృద్యమైన అనుభూతిని అందిస్తుందని ప్రామిస్ చేస్తోంది. మొదటి పాట ‘సంచారమే’ అద్భుతమైన స్పందనను సొంతం చేసుకోగా, తాజాగా మేకర్స్ చిత్ర టీజర్‌ను విడుదల చేసి, సినిమాపై మరింతగా అంచనాలను పెంచేశారు. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)ల మధ్య కెమిస్ట్రీ గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తోందీ టీజర్. ‘బేబీ’ సినిమా తర్వాత ఈ జంటకు ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్‌లో జరిగిన టీజర్ లాంచ్ (EPIC Teaser Launch) కార్యక్రమంలో.. ఇది నా కథే అన్నట్లుగా హీరో ఆనంద్ దేవరకొండ చెప్పడంతో.. సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.


ఈ కార్యక్రమంలో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఎపిక్’ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆదిత్య హాసన్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది. ఎందుకంటే నేను కూడా విదేశాల్లో చదువుకున్నాను. ఇందులోని చాలా సన్నివేశాలు నాకు కనెక్ట్ అయ్యాయి. విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళకు మాత్రమే కాదు.. ఈ కథలోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. కుటుంబం, ప్రేమ, బంధం, భావోద్వేగాలు ఇలా ప్రతిదీ ప్రేక్షకుల మనసుకు నచ్చుతాయి. దర్శకుడు ఆదిత్య హాసన్‌లో ఎంతో ప్రతిభ ఉంది. భవిష్యత్‌లో ఆదిత్యను స్ఫూర్తిగా తీసుకొని.. కొత్త దర్శకులు ఎందరో ఇండస్ట్రీలోకి వస్తారు.


వైష్ణవి చైతన్య వంటి ప్రతిభగల నటితో నటించడం సంతోషంగా ఉంది. అలాగే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ‘సార్, లక్కీ భాస్కర్, టిల్లు, మ్యాడ్, జెర్సీ’ వంటి సినిమాల సరసన ఈ ‘ఎపిక్’ చేరుతుందనే నమ్మకం ఉంది. మన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఈ ‘ఎపిక్’ ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది మన కథే కదా అనిపిస్తుంది. ఇందులో హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ప్రతి సాంగ్ అద్భుతంగా ఉంటుంది. అంతా మనసు పెట్టి ఈ సినిమాకు పనిచేశారని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

మంగ్లీపై అసత్య ప్రచారం.. అసభ్యకర పోస్టులు చేస్తున్నారు

Theater Movies: ఈ వారం.. థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్న‌ సినిమాలు

చందమామకు సెకండ్ ఇన్నింగ్స్.. సెట్ అవుతుందా

Updated Date - Apr 29 , 2026 | 08:00 PM