SLUMDOG 33: పూరి స్లమ్ డాగ్ నుంచి.. విజయ్ ఫస్ట్ లుక్
ABN, Publish Date - Jan 21 , 2026 | 07:01 AM
విజయ్ సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్.
తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ (SLUMDOG – 33 Temple Road) చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న 'దునియా' విజయ్ కుమార్ (Duniya Vijay kumar) లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ లుక్ పోస్టర్‌లో రఫ్ లుక్‌లో కనిపించారు విజయకుమార్. చిత్రంలో ఆయన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని పూరి జగన్నాథ్ చెప్పారు.
సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా టబు మరో కీలక పాత్ర పోషి స్తున్నారు. 'అర్జున్రెడ్డి', 'యానిమల్' చిత్రాలకు సంగీతం సమకూర్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఐదు భాషల్లో విడుదల కానున్నఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, చార్మి కౌర్, జేబీ నారాయణరావు నిర్మిస్తున్నారు.