సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దుల్కర్, పూజా హెగ్డే కాంబో మూవీ నుంచి కీలక అప్డేట్!

ABN, Publish Date - May 24 , 2026 | 10:39 PM

దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తన 41వ చిత్రం ‘DQ41’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రవి నెలకుడితి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన ప్రతిష్టాత్మక ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Dulquer Salmaan Pooja Hegde DQ41 Update

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం తన 41వ చిత్రం ‘DQ41’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రవి నెలకుడితి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన ప్రతిష్టాత్మక ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌ నుంచి వస్తున్న 10వ చిత్రమిది. ఈ సినిమాతో మరోసారి పూజా హెగ్డే (Pooja Hegde) టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ సినిమా సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేసింది. అద్భుతమైన భావోద్వేగాలతో కూడిన అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి కీలక అప్డేట్‌ (DQ41 Update)ని మేకర్స్ తెలిపారు.


తాజాగా ఈ చిత్ర బృందం మంచుతో కప్పుకున్న అద్భుతమైన ప్రకృతి మధ్య కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నట్లుగా తెలుపుతూ.. కొన్ని వర్కింగ్ స్టిల్స్ వదిలారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వింటర్ అవుట్ ఫిట్స్‌లో దుల్కర్ ఆకట్టుకుంటే.. పూజా హెగ్డే కూడా తన అందమైన ప్రెజెన్స్‌తో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు షూటింగ్ సమయంలోని రియల్ మూమెంట్స్‌ని ప్రజెంట్ చేస్తున్నాయి.


ఇందులోని ఒక ఫోటోలో వర్షపు జల్లుల మధ్య గొడుగుల కింద దుల్కర్, పూజా కలిసి నవ్వులు పంచుకుంటూ కనిపిస్తే, మరో ఫోటోలో బ్యాక్‌ప్యాక్స్, తాడుపై వంతెన, పర్వత ప్రాంత ప్రార్థనా జెండాల మధ్య ట్రావెల్ మూవీ ఫీల్‌ను తీసుకొస్తోంది. మరో ఫోటోలో అడవుల మధ్య ఉన్న ఆలయం ముందు చిత్ర బృందం కనిపిస్తోంది. దుల్కర్, పూజా కాంబోలో వస్తున్న తొలి చిత్రమిది. వారి మధ్య కనిపిస్తున్న కెమిస్ట్రీ చూస్తుంటే, కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్‌పై ప్రతాపం చూపించేలానే కనిపిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:

జ‌స్‌ప్రీత్ బుమ్రాకు సారీ చెప్పిన రామ్‌చ‌ర‌ణ్.. అసలు విషయమిదే!

అల్లు అయాన్‌కు ఆర్‌సీబీ ప్లేయర్ స్పెషల్ గిఫ్ట్.. బన్నీ పోస్ట్ వైరల్!

40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!

MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!

Updated Date - May 24 , 2026 | 10:39 PM