‘డ్రాగన్’ భారీ షెడ్యూల్.. ఎన్టీఆర్ రీఎంట్రీ అక్కడేనా?
ABN, Publish Date - Oct 05 , 2026 | 10:42 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తొలిసారి తెరకెక్కుతోన్న బిగ్గెస్ట్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR), సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తొలిసారి తెరకెక్కుతోన్న బిగ్గెస్ట్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ (Dragon). ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సోషల్ మీడియాలో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దీంతో ఈ చిత్రం కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తుండగా... బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ వర్సటైల్ యాక్టర్ బిజు మీనన్, సీనియర్ నటి ఖుష్బూ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ నెల మూడో వారంలోనే ఒక భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో ఈ షెడ్యూల్ జరగనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ షెడ్యూల్‌లో మొదటగా ఎన్టీఆర్‌పై ఒక గ్రాండ్ అండ్ మాసివ్ సాంగ్‌ను షూట్ చేయబోతున్నారట. దాని వెంటనే ఒక మైండ్ బ్లాకింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించనున్నారని సమాచారం. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఈ ఫైట్ సీన్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ యాక్షన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమంటున్నారు అభిమానులు.
ఇక ఇటీవల ‘డ్రాగన్’ షూటింగ్‌లో గాయపడ్డ తారక్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ షెడ్యూల్‌తోనే ఆయన తిరిగి షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో జైల్ ఫైట్, అలాగే కాళీమాత టెంపుల్ ఫైట్ సీన్స్ ఉంటాయని.. ఈ సన్నివేశాలు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు యాక్షన్ బ్లాక్స్ కోసం హాలీవుడ్ స్థాయి లేటెస్ట్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వాడుతున్నారట. హైదరాబాద్‌లో జరగనున్న ఈ షెడ్యూల్‌లోనే ఈ ఫైట్స్‌ను తెరకెక్కిస్తారని సమాచారం. ఈ రేంజ్ హాలీవుడ్ టెక్నాలజీ, పీటర్ హెయిన్ యాక్షన్, ప్రశాంత్ నీల్ మేకింగ్ అండ్ ఎన్టీఆర్ మాస్ ఎనర్జీ కలగలిస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ అవుతాయో ఊహించుకోవడానికే గూస్‌బంప్స్ వస్తున్నాయి. మరి ఈ సినిమా సృష్టించబోయే విధ్వంసాన్ని వెండితెరపై చూడాలంటే వచ్చే ఏడాది జూన్ వరకు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
నెట్‌ఫ్లిక్స్‌లో అన్న - అమెజాన్‌లో తమ్ముడు.. దుమ్మురేపుతున్నారు
డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్ వేధింపులపై విష్ణు మంచు కీలక నిర్ణయం
అలాంటి కొటేషన్స్ వేసి.. ఇలా తగ్గావ్ ఏంటి బండ్లన్నా?