పెద్ది సెట్స్‌లో.. రత్నవేలు పుట్టిన రోజు సెలబ్రేషన్స్
ABN, Publish Date - Feb 25 , 2026 | 09:22 AM
రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ ఏప్రిల్ 30న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ (Peddi) ఏప్రిల్ 30న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ దాదాపు ఇప్పటికే పూర్తయ్యింది. కేవలం కొంత టాకీ పార్ట్, ప్యాచ్ వర్క్, ఒక ప్రత్యేక గీతం బ్యాలెన్స్ ఉన్నాయి. వీటిని కూడా అతి త్వరగా పూర్తి చేసి మూవీ ప్రమోషన్స్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
క్రికెట్ క్రీడా నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ కెరీర్‌లో ఎప్పుడు కనిపించనంత మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన చికిర చికిరి పాట ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ అవగా త్వరలోనే మరో పాట రిలీజ్ చేసేందుకు సన్నద్దం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అప్డేట్ ఈ రోజు రానుంది.
అయితే మంగళవారం మూవీ సెట్‌లో డీవోపీ రత్నవేలు (Rathnavelu) పుట్టినరోజు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. చరణ్ స్వయంగా కేక్ తినిపించి రత్నవల్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉంటే ఈ మూవీ పూర్తవగానే.. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్న చిత్రం ప్రారంభం కానుంది.