‘దూరదర్శని’.. సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోకుంటే.. లైఫ్ సెటిల్ చేస్తారట!

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:09 PM

‘ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోని వారి లైఫ్‌ను నేను సెటిల్‌ చేస్తాను. ‘దూరదర్శని’.. ఓ జంటను ఎలా కలిపింది అనేది కథ’ అని అన్నారు హీరో సువిక్షిత్‌.

Dooradarshini Movie Team

సువిక్షిత్‌, గీతికా రతన్‌ హీరోహీరోయిన్లుగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దూరదర్శని’ (Dooradarshini). ‘కలిపింది ఇద్దరిని’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్. కార్తికేయ కొమ్మి (Karthikeya komi) దర్శకత్వంలో వరాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం.. అన్ని పనులను పూర్తిచేసుకుని మే 15న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం చిత్రలహరి మీట్‌ను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించింది.


ఈ కార్యక్రమంలో నటుడు జెమిని సురేష్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు దాటుకుని ఫైనల్‌గా రిలీజ్‌‌ వరకు వచ్చింది. మే 15న మీ మనసు అనే యాంటినాను దూరదర్శని వైపుకు తిప్పండి. మీ మనసులను హత్తుకునే సినిమా ఇది. ఇందులో ఓ డిఫరెంట్‌ పాత్రను చేశాను. ఇది మన ఇంటి పెరుగన్నం లాంటి సినిమా. అందరూ పల్లెటూరులో విహారించిన అనుభూతి కలుగుతుంది. అందరికి పాత జ్ఞాపకాలు గుర్తుకుతెస్తుందీ సినిమా అని తెలిపారు. దర్శకుడు కార్తికేయ కొమ్మి మాట్లాడుతూ.. ఇది కేవలం లవ్‌స్టోరీ అనుకుంటున్నారు.. కానీ, ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్‌కు, సమాజానికి నచ్చే అంశాలున్నాయి. అందరికీ 90వ దశకం రోజులను ఈ సినిమా గుర్తుకు తెస్తుంది. అందరి హృదయాలను హత్తుకుంటూ.. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ వాళ్ల గోల్డెన్‌ డేస్‌లోకి తీసుకువెళుతుంది. సువిక్షిత్‌కు హీరోగా మంచి పేరును తీసుకొచ్చే సినిమా ఇది. మే 15న ప్రముఖ వ్యక్తులు మా సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది. పతాక సన్నివేశాలు అందరినీ ఆలోచింపజేస్తాయని చెప్పుకొచ్చారు.


హీరో సువిక్షిత్‌ (Suvixith Bojja) మాట్లాడుతూ.. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ పెద్దాయన బిక్షాటన చేస్తూ కనిపించాడు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనో కథ చెప్పారు. ఆయన చెప్పిన లైఫ్‌ స్టోరీయే ఈ సినిమా. ఆయన సొంత కొడుకు వల్ల ఆ పెద్దాయన బిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అనేది ఈ కథ. యదార్థ సంఘటన చుట్టు అల్లుకున్న కథ ఇది. ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోని వారి లైఫ్‌ను నేను సెటిల్‌ చేస్తాను. ‘దూరదర్శని’.. ఓ జంటను ఎలా కలిపింది అనేది కథ. ఈ సినిమా టికెట్‌తో పాటు ఖర్చీఫ్‌ ఫ్రీగా ఇస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ గీతికా దాస్, లావణ్య రెడ్డి వంటి వారంతా మాట్లాడుతూ.. సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

మంగ్లీపై అసత్య ప్రచారం.. అసభ్యకర పోస్టులు చేస్తున్నారు

Theater Movies: ఈ వారం.. థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్న‌ సినిమాలు

చందమామకు సెకండ్ ఇన్నింగ్స్.. సెట్ అవుతుందా

Updated Date - Apr 29 , 2026 | 05:09 PM