Narayana: టికెట్ ధరలు పెంచి.. డబ్బులు పంచుకుంటారా?
ABN, Publish Date - May 29 , 2026 | 07:36 AM
సినిమా ప్రముఖులంతా చిరంజీవి ఇంట్లో సమావేశమై టికెట్ ధరలు పెంచడం ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలనే చర్చలు జరపడం ఆందోళనకరమైన విషయమని నారాయణ అన్నారు.
సినిమా ప్రముఖులంతా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశమై టికెట్ ధరలు పెంచడం ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలనే చర్చలు జరపడం ఆందోళనకర మైన విషయమని సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ (Narayana) అన్నారు. పెద్ద సినిమాలకు భారీ ఖర్చులు అవుతాయనే పేరుతో బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలు పేరుతో సామాన్యులపై అదనపు భారం మోపడం సమంజసం కాదని గురు వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సినిమా ఓ వినోద మాధ్యమమని, కళల పేరుతో ప్రజల జేబులు ఖాళీ చేయడం సరైన విధానం కాదన్నారు. ఇలాంటిది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలే తప్ప కొద్దిమంది వ్యాపార ప్రయోజనాలకు వేదిక కాకూడదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు టికెట్ ధరల పెంపు విషయంలో స్పష్టమైన విధనాలు ఉండాలని, కళల అభివృద్ధి పేరుతో దోపిడీకి అవకాశం కల్పించకూడదని సూచించారు.
ఇది కూడా చదవండి:
Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ
System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్' ఓటీటీ మూవీ రివ్యూ