సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇరుముడిని మించి అంటే సాహసమేనేమో.. మలినేని మామ

ABN, Publish Date - Sep 11 , 2026 | 03:31 PM

మాస్ మహారాజా రవితేజ (Raviteja), దర్శకుడు శివ నిర్వాణ కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి (Irumudi) చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో ఏకంగా రూ. 250 కోట్లు రాబట్టి జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే.

Gopichand Malineni

మాస్ మహారాజా రవితేజ (Raviteja), దర్శకుడు శివ నిర్వాణ కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి (Irumudi) చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో ఏకంగా రూ. 250 కోట్లు రాబట్టి జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్ జనరేషనల్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ వేడుక నిర్వహించింది. ఈ వేడుకకు చిత్రబృందంతో పాటు రవితేజతో, మైత్రీ బ్యానర్ లో వర్క్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ప్రత్యేక అతిధిగా విచ్చేశాడు. గతంలో రవితేజతో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి హ్యాట్రిక్ హిట్లు తీసిన గోపీచంద్ మలినేని.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రవితేజతో తాను చేయబోయే తదుపరి చిత్రం ఇరుముడి కంటే పెద్ద విజయాన్ని సాధించి తీరుతుందని ఛాలెంజ్ చేసి సోషల్ మీడియాని షేక్ చేశాడు.


ఈ వేడుకలో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. రవితేజతో తాను గతంలో మూడు సినిమాలు తీసినప్పటికీ, ఈ చిత్రంలో తెరపై మాస్ మహారాజాని కాకుండా త్రినాథ్ అనే పాత్రను మాత్రమే చూసి చాలా థ్రిల్ అయ్యానని చెప్పాడు. ఇరుముడి నిజమైన బ్లాక్‌బస్టర్ అని, పెట్టిన పెట్టుబడికి 5 నుంచి 6 రెట్లు ప్రాఫిట్ తెచ్చిపెట్టిందని, ఈ మధ్యకాలంలో ఏ సినిమా కూడా ఈ స్థాయి సక్సెస్ సాధించలేదని ప్రశంసించాడు. దర్శకుడు శివ నిర్వాణ రాసుకున్న కథ, ఎమోషన్స్ తనను ఎంతగానో కట్టిపడేశాయని కొనియాడాడు. రవితేజ కెరీర్‌లో ఇలాంటి భారీ హిట్లు రావడం ఇండస్ట్రీకి చాలా అవసరమని, రవితేజకు పెద్ద హిట్ వస్తే ఎంతోమంది యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లకు అవకాశాలు వచ్చి ధైర్యంగా సినిమాలు తీయగలరని, ఆయనతో వర్క్ చేసిన తమలాంటి దర్శకులకు ఆయనెంతో సపోర్ట్ ఇచ్చారని గుర్తుచేసుకున్నాడు.


చివరగా, తాను రవితేజతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేయబోయే తదుపరి చిత్రం ఇరుముడి కంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేలా ప్లాన్ చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే తన రికార్డులను కూడా ఆ తర్వాత శివ నిర్వాణ, అనిల్ రావిపూడి వంటి దర్శకులు తిరగరాయాలని ఆకాంక్షిస్తూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. అంతా ఓకే కానీ.. ఇరుముడిని మించి హిట్ కొట్టడం అంటేనే కొంచెం కష్టమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇరుముడి అంత హిట్ ఇండస్ట్రీ చూసింది లేదు. సినిమా కోసం ట్రాక్టర్లు కట్టుకొని రావడం, సినిమా వేయాలని ధర్నాలు చేయడం ఈ జనరేషన్ అస్సలు చూడలేదు. ఇక ఇలాంటి సినిమాను మించి హిట్ అంటే.. అది గోపీచంద్ మలినేని ఓవర్ కాన్ఫిడెన్స్ అని.. పెద్ద సాహసమని చెప్పుకొస్తున్నారు. మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకో మలినేని మామ.. ముందు దాదా మీద ఫోకస్ పెట్టు అని నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

Updated Date - Sep 11 , 2026 | 03:31 PM