వీరాధివీరులంట.. వారి భార్యలు వీరేనట
ABN, Publish Date - Jul 22 , 2026 | 06:08 PM
మాస్ మహారాజ రవితేజ (Raviteja), యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) కలయికలో హాసిత్ గోలి దర్శకత్వంలో ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
మాస్ మహారాజ రవితేజ (Raviteja), యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) కలయికలో హాసిత్ గోలి దర్శకత్వంలో ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కి వీరాధివీరులంట (Veeradhi Veerulanta) అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. వచ్చే నెల నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి, సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని దిల్ రాజు గట్టి ప్లానింగ్‌తో ఉన్నాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలకు ఇద్దరు హీరోయిన్లను వెతికే పనిలో ఉన్నాడట దిల్ రాజు.
అందుతున్న సమాచారం ప్రకారం హీరోయిన్లుగా ముందుగా పూజా హెగ్డే, ఐశ్వర్య రాజేష్‌లను అనుకున్నారట. వరుస ప్లాప్ లలో ఉన్నా కూడా పూజా హెగ్డేకి మాత్రం అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. రవితేజ, శ్రీవిష్ణుల సరసన ఈ ఇద్దరు భామలు బాగానే సెట్ అవుతారు అనుకొనేలోపు అనూహ్యంగా ఐశ్వర్య రాజేష్ స్థానంలో హాట్ బ్యూటీ డింపుల్ హయాతి పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. అయితే ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది ఇంకా స్పష్టత రాలేదు.
ఇప్పటికే రవితేజ - డింపుల్ హయాతి రెండు సినిమాలలో నటించారు. ఖిలాడీ, భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి జంట సందడి చేయనుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ పెయిర్ నిజమైతే.. శ్రీవిష్ణు సరసన పూజా హెగ్డే కనిపించనుంది. ఇందులో ఎంత నిజముంది అనేది తెలియదు కానీ, వీరి కాంబోలు బావున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దిల్ రాజు.. చివరికి ఎవరిని ఫైనల్ చేస్తాడో చూడాలి.