Anirudh Ravichander: గిఫ్ట్‌లు తీసుకునేవాళ్లను చూశాం.. పిల్లనే పట్టేశాడేంట్రా!
ABN, Publish Date - Oct 18 , 2026 | 11:49 AM
ఎవడైనా మంచి మ్యూజిక్ కొట్టి ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు.. లేదా గిఫ్ట్ పేరుతో బంగారమో, కారో తీసుకుంటాడు.
'‘ఎవడన్నా కోపంగా కొడతాడు.. లేదా బలంగా కొడతాడు.. వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు..
ఏదో ఒక గోడ కడుతున్నట్లు.. గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు.. చాలా జాగ్రత్తగా.. పద్దతిగా కొట్టాడ్రా.. ఆడు మగాడ్రా బుజ్జే..
‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన ఫేమస్ డైలాగ్ ఇది. మీమ్స్ క్రియేట్ చేసుకోవడానికి ఈ డైలాగ్ ఓ అస్త్రం కూడా! ఇప్పుడు అదే డైలాగ్ సంచలన సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్‌కు అన్వయించి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
‘ఎవడైనా మంచి మ్యూజిక్ కొట్టి ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు..
లేదా గిఫ్ట్ పేరుతో బంగారమో, కారో తీసుకుంటాడు.
కానీ ఈ బక్కోడు ఏంట్రా కావ్య మారన్‌నే పడగొట్టేశాడు’’ అంటూ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Anirudh Ravichander)
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ‘జైలర్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సన్‌పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ చిత్రం హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుద్‌కు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ‘జైలర్-2’ చిత్రం సక్సెస్ కావడంతో నిర్మాత టీమ్‌కు ఏ గిఫ్ట్ ఇస్తారో అని చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు అనిరుద్ పెళ్లి కళానిధి మారన్ కుమార్తె కావ్యామారన్తో జరగనున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో నవంబర్ 21న ఈజంట మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు.
ఈ నేపథ్యంలో సినిమాకు మ్యూజిక్ కొట్టి అనిరుద్ కావ్యా మారన్‌ను పడేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో జైలర్-2 సక్సెస్ కావడం.. సినిమా సక్సెస్‌లో సంగీత దర్శకుడిగా అనిరుద్ కీలక పాత్ర పోషించడంతో ఈసారి నిర్మాత టీమ్‌కు ఏం గిఫ్ట్ ఇస్తారోనని టాపిక్ మొదలైంది. కొందరైతే.. జైలర్-2 సక్సెస్ గిఫ్ట్‌గా అనిరుద్‌కు కావ్యను గిఫ్ట్‌గా ఇచ్చేశాడు నిర్మాత కళానిధి మారన్.. 'నిజంగా బక్కోడు మగాడ్రా బుజ్జే' అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ALSO READ:
Bombay Stories: 'బాంబే స్టోరీస్' ఓటీటీ మూవీ.. విశ్లేషణ
Garividi Lakshmi: నాలుగు జిల్లాలకే పరిమితమైన నా కథ.. ప్రపంచమంతా తెలిసింది..
ఐశ్వర్య లక్ష్మిని ఇలా చూస్తే.. పిచ్చెక్కాల్సిందే