సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dhurandhar Shashwat Sachdev: తెలుగులో ఎంట్రీ ఇస్తున్న‌.. 'ధురంధ‌ర్' సంగీత ద‌ర్శ‌కుడు

ABN, Publish Date - Feb 02 , 2026 | 08:05 AM

నిఖిల్, సాయి మంజ్రేక‌ర్ జంట‌గా ది ఇండియా హౌస్ (India House) చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే.

Dhurandhar Shashwat Sachdev:

నిఖిల్ (Nikhil Siddhartha), సాయి మంజ్రేక‌ర్ (Saiee M Manjrekar) జంట‌గా ది ఇండియా హౌస్ (India House) చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) నిర్మాత‌గా మారి యూవీ క్రియేషన్స్‌ విక్రమ్ రెడ్డి (Vikram Reddy) వి మెగా పిక్చర్స్ (V Mega Pictures), అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ (Abhishek Agarwal Arts)తో క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తుండ‌డం విశేషం. మూడేండ్ల క్రితమే ప్రారంభ‌మైన ఈ చిత్రం షూటింగ్ ఓ అడుగు ముందుకేస్తే రెండ‌డుగులు వెన‌క్కి అన్న చందంగా త‌యారైంది. 8 నెల‌ల క్రితం షూటింగ్ స‌మ‌యంలో ఓ భారీ యాక్సిడెంట్ జ‌ర‌గ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌ల్లో నిలిచింది. ఆ త‌ర్వాత మ‌ర‌లా ఈ చిత్రం నుంచి ఎలాంటి స‌మాచారం లేదు.

అయితే.. సుమారు మూడేండ్లుగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా చివ‌రి ద‌శ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోండ‌గా తాజాగా ఈ సినిమా విష‌యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన న్యూస్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు ధురంధ‌ర్ ఫేం శాశ్వత సత్యదేవ్ (Shashwat Sachdev) సంగీతం అందించ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. గ‌త నెల‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చి ధురంధ‌ర్ (Dhurandhar) సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. సినిమాకు సంగీతం మేజ‌ర్ ఎస్సెట్‌గా నిలిచి సినిమాను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లింది.

అలాంటి సంగీతం అందించి ప్ర‌శంస‌లు అందుకున్న శాశ్వత సత్యదేవ్ ఇప్పుడు ఈ ది ఇండియా హౌస్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇస్తుండ‌గా మూవీపై స‌డ‌న్‌గా అంచ‌నాలు పెరిగాయి. ఇప్ప‌టికే 5 అదిరిపోయే ట్రాక్స్ ఇచ్చాడ‌ని అంటున్నారు. జైమాతాది, రెవల్యూష‌న్ ఈజ్ బ్రూయింగ్, యంగ్ ఇండియా పాట‌లు విడుద‌ల‌కు సిద్దంగా ఉన్న‌ట్లు స‌మాచారం. 1905 నాటి బ్యాక్ డ్రాప్‌లో రూపొందనున్న ఈ పీరియడ్ డ్రామా షూటింగ్ ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా వేస‌విలో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. బాలీవుడ్ న‌టుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) కీలక పాత్రలో చేస్తున్నాడు.

Updated Date - Feb 02 , 2026 | 02:14 PM