సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పీవీఆర్ సినిమాస్ చేతికి ‘ధర్మస్థల నియోజకవర్గం’.. రిలీజ్ డేట్ ఫిక్స్

ABN, Publish Date - Aug 20 , 2026 | 08:48 PM

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు.

Dharmasthala Niyojakavargam Team

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై.. సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’ (Dharmasthala Niyojakavargam). జై జ్ఞాన ప్రభ తోట (Jai Jnana Prabha Thota) దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు సుమన్ (Suman) మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక చెబుతున్నా.. కచ్చితం ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. ఈ మూవీ మీద మొదటి నుంచి నాకు మంచి నమ్మకం ఉంది. సినిమా హిట్ అవుతుందనే ఆశిస్తూ వచ్చాను. డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ కథ చెప్పినప్పుడే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా అవుతుందని నమ్మాను. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను మా దర్శక నిర్మాతలు తెరకెక్కించారు. సెట్‌లో అన్నీ కుదరకపోతే ఒక్కోసారి షూటింగ్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకానీ, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ చిత్రంలో ఒక మంచి పాత్ర చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 4న ఈ సినిమాను చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానని తెలిపారు. పివిఆర్ సినిమాస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ మాట్లాడుతూ.. ‘‘ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. అదే కోవలోనే ఈ ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.


చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. ఒక బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడాలంటే ఎంత ప్రయాస ఉంటుందో.. ఒక సినిమా థియేటర్స్‌లో రిలీజ్‌కు రావాలన్నా కూడా అంతే ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ దాటుకుని మా చిత్రాన్ని సెప్టెంబర్ 4న రిలీజ్‌కు తీసుకొస్తున్నాం. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. మా ప్రొడ్యూసర్ భాస్కర్ సహకారం వల్లే ఇలాంటి మంచి చిత్రాన్ని రూపొందించగలిగాం. సినిమా పట్ల ఆయనకు చాలా ప్యాషన్ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తున్నామని తెలిపారు. నిర్మాత మేరుం భాస్కర్ మాట్లాడుతూ.. మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుంది, తప్పకుండా విజయం సాధిస్తుందని చెబుతుండటం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్స్‌లో మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అందరూ ఈ సినిమాను చూసి ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ వితికా షేరు, నటి కస్తూరి, సంగీత దర్శకుడు మహావీర్ ఏలేందర్‌తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

వెంకీమామ ఫ్యాన్స్‌కు చిరంజీవి అభినందనలు.. విషయం ఏంటంటే

‘ఇరుముడి’లో ఎలా అవకాశం వచ్చిందంటే.. : బేబీ నక్షత్ర

‘అమీర్ లోగ్’తో హైదరాబాద్ ఎరా స్టార్ట్.. ఇక అన్ని వుడ్‌లకు సౌండే!

Updated Date - Aug 20 , 2026 | 08:48 PM