సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇరుముడి మణమ్మ.. నీ నటనకు ధనుష్ ఫిదా అమ్మా

ABN, Publish Date - Aug 25 , 2026 | 03:18 PM

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా ఇరుముడి (Irumudi) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.

Dhanush

మాస్ మహారాజా రవితేజ (Raviteja) కథానాయకుడిగా, దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా ఇరుముడి (Irumudi) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. నాలుగేళ్ల తరువాత రవితేజ మంచి విజయాన్ని అందుకున్నాడు. థియేటర్ లో ప్రేక్షకుల హృదయాలను పిండేస్తూ కన్నీళ్లు పెట్టిస్తోంది. ముఖ్యంగా సినిమాలో రవితేజ కుమార్తె మణికంఠ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర తన నటనతో అందరినీ మైమరపిస్తోంది. సామాన్య ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ దిగ్గజాల నుంచి కూడా ఈ చిన్నారికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


తాజాగా వర్సటైల్ యాక్టర్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ చిత్రాన్ని వీక్షించి బేబీ నక్షత్ర అద్భుతమైన పర్ఫార్మెన్స్‌కు పూర్తిగా ఫిదా అయ్యాడు. పాపకు వీడియో కాల్ చేసి ఆమె నటనపై ప్రశంసలు కురిపించిన ఒక క్యూట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 'హలో కన్నా.. నీ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. నేను నిజంగా నీ నటనకు ఫిదా అయ్యాను. యాక్టింగ్ ఎలా చేయాలో నీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను. కచ్చితంగా ఏదో ఒకరోజు నిన్ను కలుస్తాను. అప్పుడు నాకు నేర్పించూ. సో వండర్‌ఫుల్.. సో బ్యూటిఫుల్ కన్నా.. గాడ్ బ్లెస్ యూ' అంటూ ధనుష్ కొనియాడాడు.


ఒక వైపు ధనుష్ లాంటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్టార్ నటుడు ఒక చిన్నారి నటనను మెచ్చుకోవడమే కాకుండా నీ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాలి అని వ్యాఖ్యానించడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన నక్షత్ర, ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఎంతో సహజంగా పండించి అందరినీ కట్టిపడేసింది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లలో ఆమె పండించిన హావభావాలు, పలికించిన డైలాగ్స్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఇప్పటికే రవితేజ, శివ నిర్వాణ, జి.వి. ప్రకాష్ వంటి ప్రముఖులు నక్షత్ర టాలెంట్‌ను అభినందించగా, ఇప్పుడు ధనుష్ చేసిన కామెంట్స్‌తో నెటిజన్స్ ఈ చిన్నారికి బ్రైట్ ఫ్యూచర్ ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Aug 25 , 2026 | 03:33 PM