సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

భాగ్యనగరం స్టోరీతో 'దేత్తడి'

ABN, Publish Date - May 07 , 2026 | 05:28 PM

హైదరాబాద్ లవర్స్ కు, సినిమా ప్రేమికులకు ఒక సూపర్ అప్‌డేట్. భాగ్యనగరం బ్యాక్ డ్రాప్ లో 'దేత్తడి' మూవీ రాబోతోంది. స్టార్ ప్రొడ్యూసర్లు ఈ మూవీని ప్రజెంట్ చేయబోతున్నారు.

Dethadi Poster

'రౌడీ బాయ్స్', 'లవ్ మీ' సినిమాలతో యువతను ఆకట్టుకున్న యంగ్ హీరో ఆశిష్ కొత్త చిత్రం 'దేత్తడి'తో మళ్లీ సెట్స్ మీదకు వచ్చేశాడు. సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడిగా ఆదిత్య రావు గంగాసాని పరిచయం అవుతున్నారు. తాజాగా మూవీ గురించి కొత్త అప్ డేట్ వచ్చేసింది.


హైదరాబాద్ స్థానిక కల్చర్ తో 'దేత్తడి' రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ను హైదరాబాద్‌లో గ్రాండ్ గా ప్రారంభించారు. ఆశిష్‌తో పాటు మిగతా కీలక నటీనటులంతా ఈ షెడ్యూల్‌లో జాయిన్ కాబోతున్నారు.

ఇక 'దేత్తడి' సినిమాలో ఆశిష్ పూర్తి మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. హైదరాబాదీ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పబోతున్నాడు. హై ఎమోషన్స్‌తో కూడిన కొత్త కల్చరల్ డ్రామా అని మేకర్స్ చెబుతున్నారు. సంగీత దర్శకుడిగా జునైద్ కుమార్ పనిచేస్తుండగా.. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ క్రియేటివ్ హెడ్‌గా ప్రసన్న కుమార్ బెజవాడ వ్యవహరిస్తున్నాడు. హైదరాబాద్ స్పెషల్ స్టోరీతో రానున్న 'దేత్తడి' సినిమా ఎప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా: పాయల్

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను

‘సన్ రైజర్స్‌’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?

Updated Date - May 07 , 2026 | 05:39 PM