డీమోన్ పవన్ హీరో.. ‘రాను.. బొంబైకి రాను’ ఫేమ్ లిఖిత హీరోయిన్‌గా!
ABN, Publish Date - May 31 , 2026 | 09:20 PM
సామ్రాట్, బిగ్ బాస్ ఫేమ్ డీమోన్ పవన్, ‘రాను బొంబైకి రాను’ సాంగ్ ఫేమ్ లిఖిత హీరోహీరోయిన్లుగా లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 2 చిత్రం ఆసక్తికరమైన టైటిల్‌తో రాబోతోంది.
సామ్రాట్ (Samrat), బిగ్ బాస్ ఫేమ్ డీమోన్ పవన్ (Demon Pavan), ‘రాను బొంబైకి రాను’ సాంగ్ ఫేమ్ లిఖిత (Likhita) హీరోహీరోయిన్లుగా లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 2గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘సాV3’ (SAV3). నటుడు, దర్శకుడు కృష్ణమాయ దర్శకత్వంలో నిర్మాత వి. విజయ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు కృష్ణమాయ సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆర్ట్ డైరెక్టర్, నటుడు, రైటర్.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. తను నాకు ‘ప్రేమించుకుందాం రా’ టైమ్ నుంచి తెలుసు. మా ‘ఈశ్వర్’ మూవీలో కూడా ఒక పాత్ర చేశాడు. ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. సినిమాలు రిస్క్‌ని నేను చెప్పినా.. తనకున్న ప్యాషన్‌తో మూవీస్ చేస్తున్నాడు. ఈ సినిమాను చాలా ప్లాన్డ్‌గా కంప్లీట్ చేశాడని తెలిసింది. టైటిల్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.
దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ.. మా లక్ష్మి కృష్ణ బ్యానర్ పై గతంలో ‘రైల్వే స్టేషన్’ అనే చిత్రాన్ని రూపొందించాం. రెండో సినిమా ‘సాV3’. ఈ టైటిల్ ఇలా పెట్టేందుకు ఓ కారణం ఉంది. సా అంటే సావిత్రి హీరోయిన్ పేరు. అలాగే వి అంటే విజయ్ కుమార్ అంటే డీమోన్ పవన్. 3లో త్రివిక్రమ్ రాజు అంటే సామ్రాట్ చేస్తున్న పాత్ర. ‘సాV3’ సినిమాను కంప్లీట్ చేశాక పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ పూజా కార్యక్రమాలకు కూడా ఖర్చు పెట్టగలమో లేదో అని డౌట్ ఉంది. ప్రస్తుతం సినిమా కంప్లీట్ చేసుకుని, డబ్బింగ్ కంప్లీట్ చేసుకుని ఎడిటింగ్ జరుగుతున్న టైమ్‌లో సంతోషంగా ఈ పూజా కార్యక్రమాలు పెట్టుకున్నాం. కొత్త వాళ్లు ఎలా నటిస్తారో అనుకున్నాను.. కానీ, అంతా ఇరగదీశారు. సాయి కార్తీక్ మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుంది. మా సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామని అన్నారు. ఒక మంచి చిత్రాన్ని నిర్మించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని నిర్మాత వి విజయ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత మాట్లాడుతూ.. మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్‌పై బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!
Nbk: బాలయ్య స్పీడ్ మాములుగా లేదుగా.. మరో డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్!
రానాతో కలిసి రామ్ చరణ్ చేసిన ఈ తుంటరి పనులు తెలుసా?