సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

టాలీవుడ్ గొప్పతనాన్ని తగ్గించేలా ముంబై నుంచి రివ్యూస్- ‘దీవాన’ దర్శకుడు

ABN, Publish Date - Jun 22 , 2026 | 11:40 PM

హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన నూతన చిత్రం ‘దీవాన’. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ల పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో నిర్మాతలు, దర్శకుడు.. సెన్సార్ విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Deewana Success Meet

హర్షిత్ రెడ్డి (Harshith Reddy) హీరోగా నటించిన నూతన చిత్రం ‘దీవాన’ (Deewana). అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ల పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి (Director Sreekanth Sangishetty) టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయయ్యారు. ఈ నెల 20న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెన్సార్ టీమ్‌పై, సెన్సార్ విధానంపై చిత్రబృందం ఫైర్ అయ్యారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ.. అందరూ మంచి సినిమా చేశారంటూ అప్రిషియేట్ చేస్తున్న ఫోన్ కాల్స్ ఆగడం లేదు. మరోవైపు మా సినిమాను ఇంకాస్త ఆడియెన్స్ లోకి తీసుకెళ్తే బాగుండేదని అనిపిస్తోంది. మేము రిలీజ్‌కు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో టూర్స్ ప్లాన్ చేశాం. కానీ, సెన్సార్ సర్టిఫికేషన్ వల్ల అవన్నీ క్యాన్సిల్ చేసుకున్నాం. మా సినిమాలో ముద్దు సీన్స్ లేవు, వయలెంట్ సీన్స్ లేవు. అయినా ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మాలాంటి యంగ్ టీమ్‌కు ఒక ఛాన్స్ ఇవ్వమని ప్రేక్షకుల్ని కోరుతున్నాను. మీకు మా సినిమా నచ్చకుంటే డబ్బులు రిటర్న్ ఇస్తాం. సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధర 100 రూపాయలు చేస్తున్నాం. మల్టీప్లెక్స్ ల్లో కూడా ఒక రేట్ ప్రకటిస్తాం. ప్రేక్షకులందరి దగ్గరకు వచ్చి మా సినిమాను మరోసారి రీచ్ చేయాలని అనుకుంటున్నామని తెలిపారు. మరో నిర్మాత శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ.. మా సినిమాకు ప్రీమియర్స్ పడినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుందంటూ అభినందిస్తున్నారు. భ్రమరాంభ థియేటర్ పక్కనే మా ఇళ్లు. అక్కడ మా మూవీ షో జరుగుతుంటే ప్రేక్షకుల రెస్పాన్స్ మా ఇంటి వరకు వినిపిస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాకు అలాంటి రెస్పాన్స్ వస్తుంటుంది. ఆ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యా. కానీ, మా మూవీ టికెట్స్ బుక్ చేసుకుందామని అనుకుంటున్న వారికి 18 ఫ్లస్ అని చూపిస్తోంది. అది చూసి వాళ్లు ఇందులో ఏముందో అని భయపడుతున్నారు. నేను ఒక ఆడపిల్లగా చెబుతున్నాను. నాకు ఫ్యామిలీ ఉంది.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ తో ధైర్యంగా చూసే సినిమా మేము చేశామని గర్వంగా చెప్పగలను. అందరూ థియేటర్స్‌కు వచ్చి చూడండి.. అస్సలు డిజప్పాయింట్ అవ్వరు అని అన్నారు.


డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ‘దీవాన’ సినిమా ఆగదు. శతదినోత్సవం వరకు వెళ్తుంది. మా సినిమాలో రియాలిటీ, కమర్షియాలిటీ రెండూ ఉన్నాయి. కెజియఫ్ సినిమాలో ఎలివేషన్ సీన్స్‌కు వచ్చే ఆడియెన్స్ రెస్పాన్స్.. ఈ మూవీలో చిన్న చిన్న డైలాగ్స్‌కు కూడా వస్తోంది. థియేటర్‌కు వెళ్తే హర్షిత్‌ను ఆడియెన్స్ చుట్టుముడుతున్నారు. అలాంటి ప్రేమ చూపిస్తున్నారు. ఇందులో హీరో హీరోయిన్ల పెయిన్‌ను ప్రేక్షకులు ఫీల్ అవుతూ.. కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. మన భాష, మన నేటివిటీ తెలియని వారు కొందరు మా సినిమాలోని ఎస్సెన్స్ పోగొట్టేలా సెన్సార్ కట్స్ ఇస్తున్నారు. ఇంకొందరు ముంబై నుంచి మన తెలుగు సినిమా గ్రేట్ నెస్ తగ్గించేందుకు రివ్యూస్ ఇస్తున్నారు. ఎవరేం చేసినా ఇది నా సినిమా అని గర్వంగా చెప్పగలను. తెలుగులో గత పదేళ్లలో ఇలాంటి సినిమా రాలేదు. అలాగే, నెక్ట్స్ టెన్ ఇయర్స్‌లో కూడా రాదని చెప్పుకొచ్చారు.


హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. మేము ఒక గొప్ప చిత్రం చేశాం. ఈ మాట నేను గర్వంగా చెబుతున్నాను. ఈ సినిమా చూస్తే లవ్ అనే కాన్సెప్ట్‌తో ఇప్పటి యూత్ లవ్‌లో పడతారు. మేము ఒక రియల్ లైఫ్‌ను సినిమాలో చూపించాం. ఒక అబ్బాయి మా మూవీ చూసి వాళ్ల ఫాదర్ దగ్గరకు వెళ్లి ఎమోషనల్‌గా మాట్లాడాడంటే, ఎంతగా ఈ సినిమా కనెక్ట్ అవుతుందో అర్థం చేసుకోగలరు. దీవాన ఒక టైమ్ లెస్ లవ్ స్టోరీ. మీరు ఎప్పుడూ చూసినా నచ్చుతుంది. సెన్సార్ వాళ్లను గౌరవిస్తా కానీ.. ఈ సినిమాకు మాత్రం వాళ్లు ఇంకా మంచి డెసిషన్ తీసుకోవాల్సింది. ఇది యూ బై ఏ సినిమా. థియేటర్స్‌కు వస్తే అమేజింగ్ ఎక్సిపీరియన్స్ ఇస్తాం. సింగిల్ స్క్రీన్స్‌లో వంద రూపాయలే టికెట్. మా సినిమాను సింగిల్ స్క్రీన్స్‌లో చూస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. నటుడిగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిదని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

కృష్ణవేణి నుంచి నిహారిక, సమంత వరకు... నిర్మాతలుగా మారిన నటీమణులు వీరే!

ఆ ప్రకటనలను నమ్మవద్దు: ‘వెంకీఅనిల్5’ టీమ్ హెచ్చరిక

మాట నిలబెట్టుకున్న థమన్‌.. ఎంత గొప్ప మనసో!

Updated Date - Jun 22 , 2026 | 11:40 PM