సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dear Astronaut: వితికా శేరు లేకుండానే 'డియర్‌ ఆస్ట్రోనాట్‌'!?

ABN, Publish Date - Sep 22 , 2026 | 01:05 PM

వితికా శేరు ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'డియర్ ఆస్ట్రోనాట్‌'. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి తాను, వరుణ్‌ సందేశ్ తప్పుకన్నట్టు ఇటీవల ఆమె ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమా నుంచి గౌతమ్‌ మీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.

Dear Astronaut

నటుడు వరుణ్‌ సందేశ్‌, అతని భార్య వితికా శేరు దాదాపు పదకొండేళ్ళ తర్వాత కలిసి నటించిన సినిమా 'డియర్ ఆస్ట్రోనాట్‌'. ఇందులో వితికాశేరు నాయిక కాగా, వరుణ్ సందేశ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సినిమా ప్రారంభంలో చెప్పారు. జనవరిలో ఈ సినిమా విశేషాలు తెలియచేయగా, ఫిబ్రవరిలో వితికే శేరు పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ గ్లింప్స్ ను రిలీజ్‌ చేశారు. అందులో ఆస్ట్రోనాట్‌గా వితిక శేరు కనిపించింది. ఆమెదే ఈ సినిమాలో ప్రధాన భూమిక. అయితే... రెండు మూడు రోజుల క్రితం ఈ ప్రాజెక్ట్ నుంచి తాను, వరుణ్ సందేశ్‌ వైదొలగినట్టుగా వితికా శేరు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

ఈ విషయాన్ని వివాదాస్పదం చేయడం తమ అభిమతం కాదని, కాకపోతే ఆ ప్రాజెక్ట్ తో ఇకపై తమకు సంబంధం లేదని ఆమె ఆ లేఖలో పేర్కొంది. కానీ ఈ సినిమా కారణంగా కొన్ని చేదు అనుభవాలు ఈ జంట ఎదుర్కొనట్టు ఆ లేఖ చదివితే అర్థమౌతుంది. అక్టోబర్ లో ఈ సినిమా రావాల్సి ఉంది. ఇప్పుడీ సినిమా నుంచి వితికా శేరు, వరుణ్‌ సందేశ్ తప్పుకోవడంతో ఆ పాత్రలను ఎవరితో భర్తీ చేస్తారనే పెద్ద ప్రశ్న ఉదయిస్తోంది. వాళ్ళిద్దరినీ ఒప్పించి, తిరిగి ప్రాజెక్ట్ లోకి తీసుకొస్తారా? లేకపోతే వేరే వాళ్ళతో రీ-షూట్‌ చేస్తారా? అనేది ఇంకా తెలియదు.


ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో డేవిడ్‌ ధామస్‌ గా నటిస్తున్న ప్రముఖ దర్శకుడు, నటుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ భాగ్యరాజా మాట్లాడుతూ, 'గౌతమ్‌ మీనన్‌ గారి పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన క్యారెక్టర్ ఇందులో ఆసక్తికరంగా, హైలైట్ గా నిలుస్తుంది. ‘డియర్ ఆస్ట్రోనాట్’ అనేది అంతరిక్షంలోకి ప్రయాణించాలనే ఓ యువతి కథ. చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే ఒక మహిళ దానిని ఎలా సాకారం చేసుకుందనేది ఇందులో చూపించాం. ఆకాశాన్ని అందుకోవాలనే ఆమె ఆశయం వెనుక ఉన్న సవాళ్లు, పట్టుదల, ఆశ, భావోద్వేగాలను ఇందులో గొప్పగా చిత్రీకరించాం. సినిమా షూటింగ్ పూర్తి అయింది. అక్టోబర్‌లో సినిమాని విడుదల చేయాలని అనుకుంటున్నాం' అని తెలిపారు. ఇకపై ఈ సినిమాలోని ప్రతీ పాత్రను పరిచయం చేస్తూ ఇలా 'క్యారెక్టర్ రివీల్ వీక్'ను కూడా ప్రారంభించినట్టు చెప్పారు. మరి ఇందులో ప్రధాన పాత్ర పోషించిన వితికా శేరుతో ఉన్న సమస్య పరిష్కారం కాకుండా 'డియర్‌ ఆస్ట్రోనాట్‌' ప్రచారం మొదలెట్టడంపై పలు అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. మనస్విని భాగ్యరాజా సమర్పణలో యువన్ కృష్ణ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్‌ బి కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్.. అసలు ఊహించలేదు కదా

దర్శకుడు శ్రీను వైట్ల కూతురిని చూశారా.. హాలీవుడ్ మోడల్‌కు ఏమాత్రం తీసిపోదు

మెగాస్టార్‌తో బుచ్చిబాబు.. నిర్మాణ సంస్థ కూడా రెడీ!

Updated Date - Sep 22 , 2026 | 01:08 PM