Dark Chocolate: నవంబర్ 13న బిందుమాధవి చిత్రం!

ABN , Publish Date - Sep 15 , 2026 | 03:00 PM

విశ్వదేవ్‌ రాచకొండ, బిందు మాధవి నటించిన 'డార్క్ చాక్లెట్' నవంబర్ 13న రాబోతోంది. ఈ సినిమాను శశాంక్‌ శ్రీవాస్తవయ తెరకెక్కించారు.

Dark Chocolate movie

బిందు మాధవి, విశ్వదేవ్‌ రాచకొండ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'బ్లాక్‌ చాక్లెట్‌'. గత యేడాది ప్రారంభంలో 'జానర్ ఆడగొడు, మాక్కూడా తెలీదు' అనే కాప్షన్ తో వచ్చిన పోస్టర్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన టీజర్ ను చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. అడల్ట్ కామెడీతో, పరమ బూతులుతో ఉన్న ఆ టీజర్‌ చూసిన తర్వాత ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయడానికి తీశారా? లేకపోతే ఓటీటీ కోసం తీశారా? అనే సందేహాన్ని జనాలు వ్యక్తం చేశారు. బిందు మాధవి, విశ్వదేవ్‌ రాచకొండ ఇద్దరూ తమ ఇమేజ్ లకు భిన్నమైన పాత్రలను ఇందులో చేశారు. అయితే వాటిని జనం ఎంతవరకూ యాక్సెప్ట్ చేస్తారనే ప్రశ్న ఉండనే ఉంది. ఇక లాస్ట్ ఇయర్ విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటి వరకూ రిలీజ్‌ కు నోచుకోలేదు. అయితే ఇంతకాలానికి ఇప్పుడు ఈ చిత్రాన్ని నవంబర్‌ 13న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ చెబుతూ, ఓ పోస్టర్ రిలీజ్‌ చేశారు.


రానా దగ్గుబాటి, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌ కలిసి 'పరేషాన్, 35 చిన్న కథ కాదు' చిత్రాల తర్వాత 'డార్క్ చాక్లెట్‌'ను జనాలకు అందించబోతున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం, అజిత్ అబ్రహం జార్జ్ సౌండ్ మిక్స్‌ చేస్తున్నారు. మరి 'డార్క్ చాక్లెట్‌'ను జన్ జీ అన్నా చూసి ఆదరిస్తారో లేదో!

ఇవి కూడా చదవండి!

చిన్ని ప్రాణానికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. సమంత సీమంతం పోస్ట్ వైరల్

పావలా శ్యామల కూతురికి 'మా' చేదోడు!

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ ఏందయ్యా ఈ స్పీడ్!

Updated Date - Sep 15 , 2026 | 03:01 PM