సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Cult: విశ్వక్‌ సేన్‌: ‘కల్ట్‌’ నా కెరీర్‌లోనే రిస్కీ సినిమా!

ABN, Publish Date - Oct 29 , 2026 | 03:05 PM

విశ్వక్ సేన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన కల్ట్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

''నా కెరీర్‌లో ‘కల్ట్‌’ అత్యంత రిస్కీ సినిమా. ఈ కథను చదివినప్పుడు ఇది తెరపైకి వస్తుందో లేదో అనుకున్నా. పేపర్‌పైనే ఉండిపోతుందనుకున్నా. కానీ, ఈ సబ్జెక్ట్‌ను సినిమాగా తీసుకొచ్చాం.  ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా కోసం పనిచేశా. కమర్షియల్‌ సినిమా ఫార్మాట్‌లోనే ఒక కొత్త ప్రయోగం చేసిన అనుభూతి కలిగింది" అని విశ్వక్ సేన్ అన్నారు.

ఆయన నటించి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ '‘కల్ట్‌’ సినిమా సెకండాఫ్‌ చాలా వైల్డ్‌గా ఉంటుంది. దాదాపు 45 నిమిషాల పాటు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. అయితే, ఈ సినిమాలోని కంటెంట్‌ అందరికీ నచ్చకపోవచ్చు. అందుకే వీక్‌ హార్టెడ్‌ పీపుల్‌, పిల్లలు ఈ సినిమా చూడటానికి రావద్దని చెబుతున్నా. ప్రేక్షకులకు ఒక విభిన్నమైన సినిమా అనుభవాన్ని అందించాలన్నదే నా ప్రయత్నం. అందుకే ఈ సినిమా చేశాను' అన్నారు. 

రవి బస్రూర్‌ బీజీఎం అదిరిపోయింది!

' ఈ సినిమాకు రవి బస్రూర్‌ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించారు. నా విజన్‌ను నమ్మి, ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన సాంకేతిక నిపుణులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారు. ‘కల్ట్‌’తో ప్రేక్షకులకు ఒక కొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలనుకుంటున్నా' అని అన్నారు విశ్వక్ . 

ALSO READ:

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌.. ‘అర్జున’.. రేసులో ముగ్గురు బడా డైరెక్టర్లు!

Suriya: తిరుచ్చెందూరు మురుగన్‌ సేవలో సూర్య

ధనుష్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఉచిత ట్యూషన్లు, నగదు బహుమతులు!

Updated Date - Oct 29 , 2026 | 03:55 PM