సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నటి రాధిక.. ఇదేందయ్యా ఇది

ABN, Publish Date - Aug 21 , 2026 | 02:33 PM

వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తోన్న తాజా హిలేరియస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. ఇందులో రాధిక కీలక పాత్రను పోషిస్తున్నారు.

Radhika Sarathkumar in Comrade Kalyan

వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) నటిస్తోన్న తాజా హిలేరియస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan). ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ (Radhika Sarathkumar) పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ ప్రియులను, ముఖ్యంగా నందమూరి అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.


ఈ సినిమాలో రాధిక ‘సరస్వతమ్మ’ అనే అత్యంత వినూత్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. విశేషమేమిటంటే.. ఆమె ఈ చిత్రంలో ‘నందమూరి బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్’గా నటిస్తుండటం విశేషం. విడుదల చేసిన బర్త్‌డే పోస్టర్‌లో రాధిక నుదుటిపై ‘జై బాలయ్య’ అని రాసి ఉన్న బ్యాండ్‌ను కట్టుకుని, చీరకట్టులో నడుముపై చేయి వేసి ఎంతో పవర్‌ఫుల్‌గా, మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు. సాధారణంగా హీరోలు లేదా కుర్రాళ్లు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కనిపించడం చూస్తుంటాం, కానీ ఒక సీనియర్ నటి ఇలా బాలయ్య వీరాభిమానిగా కనిపించనుండటంతో ప్రేక్షకులు ‘ఇదేందయ్యా ఇది!.. ఇది కదా బాలయ్య రేంజ్’ అంటూ ఫుల్ ఫన్ వైబ్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్ స్క్రీన్‌పై ఆమె పవర్ హౌస్ పెర్ఫార్మెన్స్ అదిరిపోనుందని మేకర్స్ పేర్కొన్నారు.


స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1992లో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పూర్తిస్థాయి వినోదభరితంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మొత్తంగా చూస్తే.. సీనియర్ నటి రాధిక పోషిస్తున్న ‘సరస్వతమ్మ’ పాత్రతో ‘జై బాలయ్య’ అంటూ థియేటర్లలో నవ్వుల పూలు, అదే టైమ్‌లో నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

మెగా బ్లాస్ట్‌కు సిద్ధమవ్వండి.. డైరెక్టర్ బాబీ పోస్ట్ వైరల్

‘మాన్‌స్టర్’గా సల్మాన్ ఖాన్.. వంశీ పైడిపల్లి స్కెచ్ ఏంటో

‘ఇరుముడి’ దర్శకుడు శివ నిర్వాణతో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

Updated Date - Aug 21 , 2026 | 02:33 PM