సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sudhakar Cherukuri: ఇంత పోటీలోనూ కొట్టాం.. అదే ఆనందం!

ABN, Publish Date - Jan 20 , 2026 | 03:04 PM

‘సంక్రాంతి బరిలో మరో నాలుగు చిత్రాలతో పోటీపడినా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi) బ్రేక్‌ ఈవెన్‌ కావడం చాలా ఆనందంగా ఉంది.

‘సంక్రాంతి బరిలో మరో నాలుగు చిత్రాలతో పోటీపడినా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi) బ్రేక్‌ ఈవెన్‌ కావడం చాలా ఆనందంగా ఉంది. ఇది లాంగ్‌ వీకెండ్‌ కాబట్టి నైజంతో పాటు మిగతా ఏరియాల్లో కూడా బ్రేక్‌ ఈవెన్‌ అవుతాయి. సినిమా సాధించిన విజయం, కలెక్షన్ల పట్ల నిర్మాతగా నేను, బయర్లు ఆనందంగా ఉన్నాం’ అని నిర్మాత సుధాకర్‌ చెరుకూరి అన్నారు. రవితేజ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా సక్సెస్‌ గురించి నిర్మాత సుధాకర్‌ (Sudhakar Cherukuri) విలేకరుల‌తో మాట్లాడారు.

రెగ్యులర్‌ రవితేజ సినిమాల్లా కాకుండా పండగకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ తీసుకురావాలని ముందే ప్లాన్‌ చేశాం. రవితేజ కూడా ఈసారి కథ కొత్తగా ఉండాలన్నారు. అందుకే సినిమాను 68 రోజుల్లో పూర్తి చేశాం. దీని వెనుక టీమ్‌ కృషి ఎంత‌గానో ఉంది. మంచి సినిమా ఏ టైమ్‌లో, ఎంత పోటీలో వచ్చినా సక్సెస్‌ సాధిస్తుందని ఈ సంక్రాంతి సినిమాలు నిరూపించాయి. వాటిలో మా చిత్రం కూడా ఉండటం చాలా ఆనందంగా ఉంది. బయ్యర్లును ఇబ్బంది పెట్టకూడదని, నిర్మాతగా సేఫ్‌ జోన్‌లో ఉంటే చాలని తక్కువ ధరకే సినిమాను ఇచ్చాం. అన్నీ కలిసి రావడంతో సినిమా సక్సెస్‌ అయింది. అయితే సంక్రాంతి బరిలో ఇంత‌మందిమి ఒక్కసారిగా వచ్చి డిస్ట్రిబ్యూటర్ల‌ను నలిపేశాము. ఇది మళ్లీ రిపీట్‌ కాదు. ఈ సినిమా సాధించిన విజయం, కలెక్షన్ల విష‌యంలో నిర్మాతగా నేను, బయర్లు ఆనందంగా ఉన్నాం.

చిరంజీవి సినిమా ఫస్ట్‌ అప్షన్‌..

ఈ సంక్రాంతి బరి విడుదలైన చిత్రాల్లో ఆడియన్స్‌కి చిరంజీవి గారి సినిమా ఫస్ట్‌ ఆప్షన్‌. తొలి వారంలో ఆ సినిమాను బాగా చూసేశారు. ఇప్పుడు సెకండ్‌ వీక్‌ నుంచి మిగతా సినిమాల రన్‌ కూడా అద్భుతంగా ఉండబోతుంది. రవితేజ గారితో మేం చేసిన రెండో సినిమా ఇది. అన్నదమ్ముల బాండింగ్‌ మాది. మొదటి సినిమాల్లా కాకుండా ఇది మేం అనుకున్నట్లు అన్ని ఎలిమెంట్స్‌తో తీశాం.  

చరణ్‌తో పోటీ పడము..

‘ప్యారడైజ్‌’ సినిమా 60 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. ట్రైలర్‌లో చూసినంత వ‌యోలెంట్‌గా ఈ సినిమా ఉండదు. మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాతో పోటీపడము. సమ్మర్‌లో పెద్ద సినిమాల హవా ఇప్పటిదాకా అయితే లేదు. క్లాష్‌ కాకుండా సినిమాను విడుదల చేస్తాం.

 కొత్త.. దర్శకులే

దసరాతో శ్రీకాంత్‌ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేశాం. అలాగే దుల్కర్‌తో చేస్తున్న సినిమాకు కూడా దర్శకుడు కొత్త‌వాడే. దుల్కర్‌, పూజ హెగ్డే కలిసి చేస్తున్న ఈ సినిమా అద్భుతంగా వస్తోంది. వాళ్ల కాంబినేషన్‌ చాలా బాగుంటుంది. ఈ సినిమా కోసం పూజాహెగ్డే 80 రోజులు కాల్షీట్లు ఇచ్చింది. ఇందులో ఆమె క్యారెక్టర్‌ ఊహించని విధంగా ఉంటుంది.

Updated Date - Jan 20 , 2026 | 07:36 PM