Vishwambhara: చిరంజీవి విశ్వంభరకు మోక్షం ఎప్పుడో.. డబ్బింగ్‌పై క్రేజీ అప్డేట్!
ABN, Publish Date - Nov 11 , 2026 | 04:03 PM
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘విశ్వంభర’ సినిమా మొదలై చాలా కాలం అయినా ఇంకా విడుదలకు నోచుకోలేదు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). సినిమా మొదలై చాలా కాలం అయినా ఇంకా విడుదలకు నోచుకోలేదు. షూటింగ్ పూర్తయినప్పటికీ పలు కారణాల వల్ల విడుదల తేదీ ఖరారు కాలేదు. ఇటీవల సంక్రాంతికి పక్కాగా విడుదలవుతుందనే వార్తలు వచ్చినా నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ జరుగుతున్నట్లు తెలిసింది.
తాజాగా డబ్బింగ్ పనులకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో నటించిన కమెడియన్ ప్రవీణ్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. తన పాత్రకు డబ్బింగ్ పూర్తయిందని సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసి వెల్లడించారు. ఈ అప్డేట్తో మెగా అభిమానుల్లో కాస్త ఆసక్తి పెరిగింది. డబ్బింగ్ పనులు మొదలయ్యాయంటే సినిమా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరంజీవిని మరో కొత్త ప్రపంచంలో చూపించేందుకు దర్శకుడు వశిష్ఠ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. డబ్బింగ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ‘విశ్వంభర’ విడుదలపై చిత్ర బృందం త్వరలోనే స్పష్టత ఇస్తుందేమో చూడాలి.
ALSO READ:
Renudesai: స్టార్స్ తో కలిసి.. కోలీవుడ్లోకి రీ ఎంట్రీ
ఏం లేదు సినిమాలో... రామాయణపై రీల్ కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు'
చాలా సింపుల్ గా ఇరుముడి హీరోయిన్ పెళ్లి ..