చాలా సింపుల్ గా ఇరుముడి హీరోయిన్ పెళ్లి ..
ABN , Publish Date - Nov 11 , 2026 | 02:56 PM
సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుగుతాయో అందరికీ తెల్సిందే. అత్యంత వైభవంగా, కళ్లు చెదిరే లైట్స్ తో.. ఉదయపూర్ కోటలో, డెస్టినేషన్ వెడ్డింగ్ లా జరుగుతాయి.
సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుగుతాయో అందరికీ తెల్సిందే. అత్యంత వైభవంగా, కళ్లు చెదిరే లైట్స్ తో.. ఉదయపూర్ కోటలో, డెస్టినేషన్ వెడ్డింగ్ లా జరుగుతాయి. కానీ, వీటన్నింటికి విరుద్ధంగా కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. దీంతో అందరి దృష్టి ఈ పెళ్లి మీదనే పడింది. బీచ్ ఒడ్డున ప్రియా భవానీ శంకర్.. తన ప్రియుడు రాజ్ వేల్ తో మూడు ముళ్లు వేయించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
చాలా సింపుల్ గా రెడ్ కలర్ చీరలో ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా ప్రియా పెళ్లి మండపానికి రాగా.. వైట్ కలర్ పంచెలో రాజ్ అంతే నిరాడంబరంగా కనిపించాడు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట ఒకట్టయ్యారు. ప్రియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్నేళ్లకే.. రాజ్ ని తన లవర్ గా పరిచయం చేసింది. దాదాపు 10 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే వీరు పెళ్లికి ముందే ఒక ఇంటిని కొనుగోలు చేసి అందులోనే ఉంటున్నారు. ఏదిఏమైనా కోట్లు ఖర్చుపెట్టకుండా ఇలా సింపుల్ గా పెళ్లి చేసుకున్న ప్రియా - రాజ్ లను అందరూ మెచ్చుకుంటున్నారు. అందరూ ఇలాగే పెళ్లిళ్లు చేసుకుంటే.. చాలా ఖర్చు మిగిలుతుందని చెప్పుకొస్తున్నారు.
ఇక ప్రియా భవానీ శంకర్ కెరీర్ విషయానికొస్తే.. ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆమె వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒకటి కాదు రెండు ఏకంగా మూడు పెద్ద సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇప్పటికే తనకు ఎంతో అచ్చి వచ్చిన డిమాంటి కాలనీ 3 లో నటిస్తోన్న ప్రియా .. ఇది కాకుండా ఇండియన్ 3 లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇంకా రెండు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి పెళ్లి తరువాత అమ్మడి రేంజ్ ఏ రేంజ్ లో పెరుగుతుందో చూడాలి.