Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?
ABN, Publish Date - Apr 11 , 2026 | 08:57 PM
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటేనే థియేటర్ల దగ్గర పూనకాలు మొదలవుతాయి. ఈ ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ హిట్‌తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. రీజనల్ పరంగా టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆ సినిమా నిలిచి, మెగాస్టార్ పవర్ ఏంటో ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ఈ పేరు వింటేనే థియేటర్ల దగ్గర పూనకాలు మొదలవుతాయి. ఈ ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) వంటి భారీ హిట్‌తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. రీజనల్ పరంగా టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆ సినిమా నిలిచి, మెగాస్టార్ పవర్ ఏంటో ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. అయితే, ఇంతటి ఘనవిజయం తర్వాత మెగా అభిమానులు ఆయన తదుపరి చిత్రాల కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మెగాస్టార్‌కు వెయిటింగ్ తప్పేలా లేదు.
మెగాస్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే పలుమార్లు ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. రీసెంట్‌గా ఈ చిత్రాన్ని జూలై నెలలో విడుదల చేస్తామని టాక్ వచ్చినా, ప్రస్తుతానికి దానిపై సరైన స్పష్టత లేదు. గ్రాఫిక్స్ పనులు ఆలస్యం అవుతున్నాయా లేక మరేదైనా కారణమా అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ గందరగోళం మెగా అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. ఇక ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రావాల్సిన సినిమా పనులు కూడా ముందుకు సాగడం లేదు. దీని వెనుక ప్రధానంగా ఒక పెద్ద చిక్కుముడి ఉంది. అదే.. ఆ నిర్మాణ సంస్థ నుంచి గతంలో వచ్చిన ‘జననాయగన్’ సినిమా వివాదం. ఈ సినిమాకు సెన్సార్ పరంగా ఇబ్బందులు ఎదురవ్వడమే కాకుండా, తాజాగా ఆ చిత్రం ఇంటర్నెట్‌లో లీక్ అవ్వడం మేకర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చే వరకు మెగాస్టార్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపించడం లేదు.
మరోవైపు యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)తో కూడా మెగాస్టార్ ఒక ప్రాజెక్ట్ ఓకే చేశారు. ‘దసరా’ చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెల తీయబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఆ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ముగిసి థియేటర్లలోకి వచ్చేంత వరకు మెగాస్టార్ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకునేలా లేవు. ఇలా ఒకదాని వెనుక ఒకటి చిరంజీవి సినిమాలన్నీ వాయిదాల పర్వంలో చిక్కుకున్నాయి. ఒకవైపు నిర్మాణ సంస్థల ఇబ్బందులు, మరోవైపు దర్శకుల బిజీ షెడ్యూల్స్ వెరసి.. మెగాస్టార్ కొత్త సినిమాలను ఎప్పుడు చూస్తామో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ అడ్డంకులన్నీ దాటుకుని మెగాస్టార్ ఎప్పుడు మేకప్ వేసుకుంటారో, ఎప్పుడు రికార్డులు తిరగరాస్తారో వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!
Jailer 2: షారుఖ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్.. బాబోయ్, ఈ వార్త నిజమైతేనా?
దయచేసి రూ.16 కోట్లు సాయం చేయండి: నందమూరి బాలకృష్ణ
‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్