Chiranjeevi: నన్నెవరూ అడగరు.. కానీ నేనే క్రమశిక్షణ తప్పితే ఎలా?
ABN, Publish Date - Sep 22 , 2026 | 05:57 PM
మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ మొదలుపెట్టి 48 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మెగా యూత్ ఫోర్స్ కార్యక్రమం నిర్వహించారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినీ కెరీర్ మొదలుపెట్టి 48 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మెగా యూత్ ఫోర్స్ (Mega youth Force) కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో అభిమాను సత్కరించారు.
ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ "ప్రస్తుతం 'కాకా’ సినిమాలో నటిస్తున్నాను. ఇందులో నా పాత్ర పేరు కదిరి కాళిదాసు. ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో చాలా హెవీ సీన్స్ చేస్తున్నాను. సినిమా కోసం ప్రతిరోజూ తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్రలేస్తాను. ఆ తర్వాత గంటపాటు కచ్చితంగా వ్యాయామం చేస్తాను. మేకప్ పూర్తి చేసుకుని ఉదయం 8 గంటలకే కోకాపేటలోని షూటింగ్ సెట్స్‌కు చేరుకుంటాను. నేను సమయానికి సెట్స్‌కు రావడం గొప్పగా చెప్పుకోవడానికి కాదు. నేను 10 గంటలకు వచ్చినా నన్ను ఎవరూ అడగరు. కానీ నేనే క్రమశిక్షణ పాటించకపోతే, మిగిలిన టీమ్ ఎలా ఉంటుంది? ఒక సినిమా అనేది ఎంతోమంది కలిసి పనిచేసే ప్రక్రియ. అందులో ప్రతి ఒక్కరి సమయం ఎంతో విలువైనది. అందుకే నేను నా వంతుగా సమయపాలన పాటిస్తాను. నా దర్శకులందరూ కూడా ఉదయం 7 గంటలకే పూర్తి టీమ్‌తో సెట్స్‌లో సిద్ధంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అమెరికా అధ్యక్షుడికైనా, ఇక్కడి సాధారణ కార్మికుడికైనా రోజుకు 24 గంటలే ఉంటాయి. కాబట్టి మనకు ఉన్న సమయాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటామన్నదే ముఖ్యం. నా 48 ఏళ్ల సినీ ప్రయాణంలో అభిమానుల ప్రేమ, అభిమానం నాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. ‘మెగా యూత్ ఫోర్స్’ మరింత బలోపేతం కావడానికి మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి. అభిమానులు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అది అందించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. మిమ్మల్ని వీలైనంతగా అలరించడంపైనే నా దృష్టి ఉంటుంది. మంచి సినిమాలు చేయడం, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం నా బాధ్యతగా భావిస్తాను. మీతో నాకు ఉన్న ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్.. అసలు ఊహించలేదు కదా
దర్శకుడు శ్రీను వైట్ల కూతురిని చూశారా.. హాలీవుడ్ మోడల్‌కు ఏమాత్రం తీసిపోదు
మెగాస్టార్‌తో బుచ్చిబాబు.. నిర్మాణ సంస్థ కూడా రెడీ!