Chiranjeevi: అఖిల్ ప్రతి సినిమాతో పరిణతి సాధిస్తున్నాడు
ABN, Publish Date - Jul 13 , 2026 | 02:08 PM
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన 'లెనిన్' చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అఖిల్ నటనకు వస్తున్న ప్రశంసలు సినీ ప్రముఖుల దృష్టిని సైతం ఆకర్షిస్తున్నాయి.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni) కథానాయకుడిగా నటించిన 'లెనిన్' (lenin) చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అఖిల్ నటనకు వస్తున్న ప్రశంసలు సినీ ప్రముఖుల దృష్టిని సైతం ఆకర్షిస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'లెనిన్' సినిమాకు వస్తున్న స్పందన గురించి విన్నాను. అఖిల్ నటనకు గురించి ప్రేక్షకులు, అభిమానులు అద్భుతంగా చెబుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. అఖిల్ నాకు ఎంతో ఇష్టమైన వాడు, మరో కొడుకులాంటి వాడు. ప్రతి సినిమాతో నటుడిగా అతను మరింత పరిణతి సాధిస్తుండటం ఆందనడం కలిగిస్తోంది' అని చిరంజీవి పేర్కొన్నారు. లెనిన్' సినిమాను త్వరలోనే చూసేందుకు ఆసక్తిగా ఉన్నానని, ఈ చిత్రం మరింత విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
అంతేకాకుండా తన మిత్రుడు నాగార్జునతో పాటు దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక బృందం అందరికీ ఆయన అభినందనలు తెలిపారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిరంజీవి ట్వీట్ కి నాగార్జున కూడా స్పందించారు. 'చిరంజీవి గారు ప్రతి సందర్భంలోను మీరు నాకు, నా కుటుంబానికి అండగా, ఓ పిల్లర్ లాగా సపోర్ట్ చేస్తున్నారు. దయ చేసి సినిమా కూడా చూడండి. మీకు తప్పకుండ నచ్చుతుందని ప్రామిస్ చేసి చెబుతున్నా' అని నాగార్జున ట్వీట్ చేశారు.అఖిల్, భాగ్యశ్రీ బోర్సేజంటగా నటించిన ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు.
ALSO READ:
S Janaki: జానకమ్మ అంతిమయాత్రలో కనిపించిన సంస్కారం.. నెటిజన్ల ప్రశంసలు
Laya: సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒకే రోజు రెండు సినిమాలు!