సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మెగాస్టార్‌తో బుచ్చిబాబు.. నిర్మాణ సంస్థ కూడా రెడీ!

ABN, Publish Date - Sep 21 , 2026 | 08:05 PM

దర్శకుడు బుచ్చిబాబు సానా.. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోవడంతో, ఆయన తదుపరి అడుగు ఎవరితో ఉండబోతోందన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Chiru and Buchi Babu

‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Mega Power Star Ram Charan)తో భారీ ప్రాజెక్ట్‌గా ‘పెద్ది’ (Peddi) తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana).. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోవడంతో, ఆయన తదుపరి అడుగు ఎవరితో ఉండబోతోందన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విమర్శలు, ప్రచారాలకు చెక్ పెడుతూ బుచ్చిబాబు మరోసారి మెగా కాంపౌండ్‌పైనే గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఈసారి ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఆయన లైన్‌లో పెట్టినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.


ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన చర్చలు ఇప్పటికే టాలీవుడ్‌లో వేగంగా వ్యాపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా, భావోద్వేగాలు, మాస్ అంశాలు కలబోసిన ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను బుచ్చిబాబు సిద్ధం చేసినట్లు సమాచారం. సుకుమార్ శిష్యుడిగా కథలను రా అండ్ రస్టిక్ ఎమోషన్స్‌తో చెప్పడంలో దిట్ట అయిన బుచ్చిబాబు.. చిరంజీవిని తెరపై సరికొత్త పంథాలో ప్రెజెంట్ చేసేందుకు భారీ ప్రణాళికలే రచిస్తున్నట్లు వినికిడి. ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.


మరో విశేషమేమిటంటే, ఈ భారీ చిత్రానికి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెన్నుదన్నుగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్.. అటు బుచ్చిబాబుతోనూ ‘ఉప్పెన’ సమయం నుంచే మంచి అనుబంధాన్ని కలిగి ఉంది. మైత్రీ బ్యానర్‌లో మెగాస్టార్ - బుచ్చిబాబు కలయిక నిజంగా ఖరారైతే, థియేటర్లలో సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమని సినీ ప్రియులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఊహాగానాలకే పరిమితమైన ఈ కాంబినేషన్‌పై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

జనసైనికుడి కుటుంబానికి నాగబాబు ఓదార్పు

46 కోట్లు కొట్టేయడానికి కుట్ర.. తోడబుట్టిన వారిపై నటి రాధ ఫిర్యాదు

వైష్ణవి చైతన్య రియల్ ఏజ్.. ఆధార్ కార్డు చూపించి మరీ చెప్పిందిగా

Updated Date - Sep 21 , 2026 | 08:05 PM