సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సరికొత్త రికార్డులు సృష్టించాలి.. నాని ‘ద ప్యారడైజ్’కు మెగా ఆశీస్సులు

ABN, Publish Date - Sep 23 , 2026 | 09:17 PM

నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం ‘ద ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాకు చిరంజీవి ఆశీస్సులు అందాయి.

Chiru Greetings to The Paradise

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం ‘ద ప్యారడైజ్’ (The Paradise) బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెడుతుండగా, బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రి నుంచే భారీ ఎత్తున ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ప్రీమియర్స్‌కు ప్రతిచోటా ఒక్క టికెట్ ముక్క కూడా దొరక్కుండా అన్ని షోలు శరవేగంగా సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఈ స్థాయి ఊహించని క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే.. తొలిరోజే నాని ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని సునాయాసంగా అందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ నుంచి నాని అండ్ చిత్ర టీమ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘ది ప్యారడైజ్’ చిత్ర బృందాన్ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రత్యేక ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. నాని అంకితభావాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూ మెగాస్టార్ పెట్టిన పోస్ట్ అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ‘‘మై డియర్ నాని.. కొత్తదనాన్ని అన్వేషించడంలో నీకున్న ఉత్సాహం, అంకితభావం, తపనను చూడటం ఎప్పుడూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ‘దసరా’ చిత్రంలో నువ్వు, శ్రీకాంత్ చూపించిన ప్యాషన్, సంకల్పాన్ని చూసిన తర్వాత.. మీరిద్దరూ కలిసి ‘ద ప్యారడైజ్’ ద్వారా సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి మళ్లీ రావడం ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తోంది. ఈ ప్రత్యేకమైన చిత్రాన్ని వెండితెరపై వీక్షించేందుకు నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను’’ అంటూ చిరంజీవి రాసుకొచ్చారు.


అంతేకాకుండా చిత్ర బృందానికి తన నిండు మనసుతో ఆశీస్సులు అందజేస్తూ.. ‘‘హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి (ఎస్ఎల్వీ సినిమాస్), సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో పాటు చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేస్తున్నాను. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు, సరికొత్త మైలురాళ్లను నెలకొల్పి, చిత్రంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయమైన పండుగ సంబరాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని చిరంజీవి దీవించారు. మెగాస్టార్ నుంచి ఇంతటి అద్భుతమైన ప్రశంసలు, ఆశీస్సులు దక్కడంతో నాని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ అందించిన అదిరిపోయే సంగీతం, శ్రీకాంత్ ఓదెల రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో వస్తోన్న ‘ద ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. నెక్ట్స్ మెగాస్టార్ చిరంజీవితో నాని ఓ చిత్రాన్ని నిర్మింబోతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెలానే దర్శకుడు.

ఇవి కూడా చదవండి:

‘ద ప్యారడైజ్’ విడుదల వేళ.. నాని వైఫ్ ఎమోషనల్ పోస్ట్

ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉద్రిక్తత.. జానీ మాస్టర్ భార్య పై దాడి

యూఎస్ మార్కెట్‌లో ‘ద ప్యారడైజ్’ రికార్డు.. మహేష్ సరసన నాని!

Updated Date - Sep 23 , 2026 | 09:17 PM