సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Yellamma: దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’లో మరో క్రేజీ నటుడు!

ABN, Publish Date - Nov 07 , 2026 | 08:15 PM

‘బలగం’ సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్నారు వేణు యెల్దండి. ఆయన తెరకెక్కిస్తున్న రెండో చిత్రం  ‘ఎల్లమ్మ’ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది 

‘బలగం’ (Balagam)సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్నారు వేణు యెల్దండి. ఆయన తెరకెక్కిస్తున్న రెండో చిత్రం  ‘ఎల్లమ్మ’ (yellamma). సంగీత దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పని చేసిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. అనంతిక సనిల్‌కుమార్ కథానాయిక. తాజాగా ఈ సినిమాను సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం చైతూ జొన్నలగడ్డ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ పాత్ర గురించి ఆయనతో చర్చలు జరిపారని సమాచారం. అంత ఒకే అయితే ఆయన ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఏమి రాలేదు.  

ఈ సినిమాను ప్రకటించి చాలా కాలమైనా సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది. ప్రస్తుతం షూటింగ్ సజావుగా సాగుతోంది.  ‘బలగం’తో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించిన వేణు యెల్దండి.. ఈసారి జానపద నేపథ్యంతో కూడిన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

ALSO READ:
Anaswara Rajan: కథల ఎంపికలో నా ఫస్ట్ ప్రయారిటీ అదే..

ఎట్టకేలకు ‘హనుమాన్ అంశ్’ ఓటీటీకి.. ఎప్పుడంటే

నన్ను ఎంత తక్కువగా అంచనా వేస్తే.. అంతగా గెలిచి చూపిస్తా: ధనుష్

Updated Date - Nov 07 , 2026 | 09:18 PM