సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మహేష్ బాబు కాదా.. బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ మెగాస్టార్‌తోనా?

ABN, Publish Date - Aug 14 , 2026 | 07:22 PM

మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడమే కాకుండా, టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ఈ దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

Buchi Babu and Chiru

మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడమే కాకుండా, టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana). క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యరికంలో దర్శకత్వ మెళకువలు నేర్చుకున్న బుచ్చిబాబు.. మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ‘ఉప్పెన’ (Uppena) చిత్రంతో మెగాఫోన్ పట్టి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. రెగ్యులర్ రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా, అత్యంత బలమైన భావోద్వేగాలతో కూడిన కథను వెండితెరపై ఆవిష్కరించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. అంతేకాకుండా ఏకంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని సైతం కైవసం చేసుకుని తన సత్తా ఏంటో నిరూపించారు.


‘ఉప్పెన’ ఇచ్చిన భారీ విజయంతో బుచ్చిబాబు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తన రెండో సినిమానే ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘పెద్ది’ (Peddi) మూవీ చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఏకంగా రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అద్భుతమైన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్‌బస్టర్లు సాధించడంతో, ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఒకటే ఆసక్తి నెలకొంది. బుచ్చిబాబు తర్వాతి ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతోంది? గతంలో ‘పెద్ది’ రిలీజ్ సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu)తో సినిమా ఉంటుందని లేదా రామ్ చరణ్‌తోనే మళ్లీ ఇంకో ప్రాజెక్ట్ చేస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే, వీటిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. బుచ్చిబాబు మరోసారి మెగా కాంపౌండ్‌లోనే సినిమా చేయబోతున్నారని, ఈసారి ఏకంగా టాలీవుడ్ బాస్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తోనే భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా బుచ్చిబాబు అదిరిపోయే ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.


ఒకవేళ మెగాస్టార్-బుచ్చిబాబు కాంబినేషన్ నిజమైతే ఇది టాలీవుడ్‌లోనే క్రేజీ ప్రాజెక్ట్‌గా మారడం ఖాయం. అయితే ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లడానికి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో వస్తున్న ‘మెగా 158’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే, నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఒక వైవిధ్యమైన భారీ పాన్ ఇండియా చిత్రాన్ని లైన్‌లో పెట్టారు. ఈ కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. దర్శకుడిగా బుచ్చిబాబు ప్రతిభపై చిరంజీవికి కూడా మంచి నమ్మకం ఉంది. బుచ్చిబాబు సిద్ధం చేస్తున్న కథ ఆయనని పూర్తిస్థాయిలో మెప్పిస్తే, మెగాస్టార్ నుంచి త్వరలోనే అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి మెగాస్టార్ చిరంజీవి, బుచ్చిబాబు సానా కాంబినేషన్ నిజంగానే తెరపైకి వస్తుందా? లేదా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

డీపీ మార్చిన రెబల్ స్టార్.. ఇక అంతా ‘ఫౌజీ’ గురించే!

పోతురాజు ఆహార్యంలో శ్రీహరి తనయుడు.. పోస్టర్ అదిరింది!

రాత్రి తాగింది దిగలేదు.. అందుకే! ఇదెక్కడి మాస్ ప్రమోషన్స్‌రా అయ్యా..

Updated Date - Aug 14 , 2026 | 07:22 PM