పోతురాజు ఆహార్యంలో శ్రీహరి తనయుడు.. పోస్టర్ అదిరింది!

ABN , Publish Date - Aug 14 , 2026 | 04:53 PM

రియల్ స్టార్ శ్రీహరి వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన తనయుడు మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా భైరవకాళి ఫ్లిక్స్ బ్యానర్‌పై ఓ సరికొత్త భారీ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

Meghamsh Srihari New Movie Update

తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటనతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దిగ్గజ నటుడు ‘రియల్‌స్టార్‌’ డా. శ్రీహరి (Real Star Srihari). ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన తనయుడు మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా భైరవకాళి ఫ్లిక్స్ (Bhairavakali Flicks) బ్యానర్‌పై ఓ సరికొత్త భారీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. లెల్లా రోహిత్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను లెల్లా రాహుల్‌ నిర్మిస్తున్నారు.


ఆగస్ట్ 15న దివంగత లెజెండరీ నటుడు శ్రీహరి జయంతిని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ సినిమా నుంచి పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో విశిష్టమైన ‘పోతురాజు’ ఆహార్యంలో మేఘాంశ్‌ శ్రీహరి (Meghamsh Srihari) కనిపించిన తీరు సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో మేఘాంశ్‌ వెనుక రియల్‌స్టార్‌ శ్రీహరి కూడా అదే పోతురాజు అవతారంలో కనిపిస్తూ తనయుడికి అండగా నిలబడినట్లు డిజైన్ చేసిన విధానం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఇప్పటికే 50 శాతానికి పైగా చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఇండియాస్ బిగ్గెస్ట్ టైటిల్ గ్లింప్స్ రివీలింగ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రత్యేక ఈవెంట్ ద్వారా సినిమాలో హీరోకు సంబంధించిన కథా ప్రపంచాన్ని ప్రేక్షకులకు ఘనంగా పరిచయం చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అతి త్వరలోనే అధికారికంగా మేకర్స్ వెల్లడించనున్నారు.

ఇవి కూడా చదవండి:

రాత్రి తాగింది దిగలేదు.. అందుకే! ఇదెక్కడి మాస్ ప్రమోషన్స్‌రా అయ్యా..

ప్రతీ 15 రోజులకూ.. నా పాస్‌వర్డ్స్ అన్నీ మారుస్తా: కింగ్ నాగార్జున

Rare Pic: ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు చిరుని ఏం చేద్దామనుకుంటున్నారో

Updated Date - Aug 14 , 2026 | 04:53 PM