సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఏమో ఏమో ఇది.. రోషన్ - ప్రీతి ముకుందన్ కెమిస్ట్రీ అదిరిపోయింది

ABN, Publish Date - Sep 29 , 2026 | 04:12 PM

యువ కథానాయకుడు రోషన్ మేకా, అందాల భామ ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న సరికొత్త రొమాంటిక్ కామెడీ చిత్రం 'ఏమో ఏమో ఇది'. ఇప్పటివరకు సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో ఆకట్టుకున్న

Emo Emo Idi

యువ కథానాయకుడు రోషన్ మేకా, అందాల భామ ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న సరికొత్త రొమాంటిక్ కామెడీ చిత్రం 'ఏమో ఏమో ఇది'. ఇప్పటివరకు సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో ఆకట్టుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు శైలేష్ కొలను తొలిసారిగా పూర్తిస్థాయి రొమాంటిక్ కామెడీ జోనర్‌లో చేస్తున్న ప్రయోగం కావడంతో ఈ చిత్రంపై పరిశ్రమలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఏమో ఏమో ఇది అంటూ సాగే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.


సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మంచు కొండలు, అందమైన కేబిన్లు, మనోహరమైన వంతెనల నేపథ్యంలో చిత్రీకరించిన ఈ మెలోడీ పాటలో నటీనటుల మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకుంటోంది. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ హెషామ్ అబ్దుల్ వహాబ్ అందించిన ఈ ఆహ్లాదకరమైన స్వరాలకు ప్రముఖ గాయకులు కార్తీక్, రమ్య బెహరా తమ మంత్రముగ్ధమైన గొంతుతో ప్రాణం పోశారు. వినగానే ఆకట్టుకునేలా ఉన్న ఈ టైటిల్ ట్రాక్ సంగీతాభిమానుల గుండెలను పిండేస్తోంది. శైలేష్ కొలను మార్క్ టేకింగ్, రోషన్-ప్రీతిల కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని ఈ సాంగ్ చూస్తుంటే తెలుస్తోంది.


మనోహరమైన దృశ్యాలు, రోషన్ - ప్రీతి లవ్లీ కెమిస్ట్రీ, హెషామ్ అందించిన సోల్‌ఫుల్ ట్యూన్ ఈ పాటను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలబెట్టాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ క్యూట్ లవ్ స్టోరీని అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో రోషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Sep 29 , 2026 | 04:12 PM