సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఓజీ-2’ కన్నా ముందే ‘బ్లడీ రోమియో’.. సుజిత్ మెగా ట్విస్ట్

ABN, Publish Date - Aug 04 , 2026 | 07:21 PM

‘రన్‌ రాజా రన్‌, సాహో, ఓజీ’.. తీసింది మూడే మూడు సినిమాలు.. మూడు దేనికవే డిఫరెంట్‌ సినిమాలు, కానీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సుజిత్‌ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం మామూలుది కాదు.

Sujeeth Next Project Update

‘రన్‌ రాజా రన్‌, సాహో, ఓజీ’.. తీసింది మూడే మూడు సినిమాలు.. మూడు దేనికవే డిఫరెంట్‌ సినిమాలు, కానీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సుజిత్‌ (Sujeeth) క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం మామూలుది కాదు. అవును.. విజువల్స్‌ని, యాక్షన్‌ని ఒక రేంజ్‌లో ప్రెజెంట్ చేసే యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Power Star Pawan Kalyan)తో చేసిన ‘ఓజీ’ (OG) సినిమాతో మెగా అభిమానులకు పూనకాలు తెప్పించాడు. పవర్‌స్టార్‌కు బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ పడితే ప్రభంజనం ఎలా ఉంటుందో సుజిత్ తన డైరెక్షన్‌తో సరికొత్తగా చూపించాడు. ‘ఓజీ’ సక్సెస్‌తో ట్రేడ్ వర్గాల్లో సుజిత్ మార్కెట్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది.


సుజిత్ తదుపరి సినిమా ఎవరితో ఉండబోతోంది? ‘ఓజీ’కి సీక్వెల్‌గా ‘ఓజీ-2’ (OG 2) వస్తుందా? లేక నేచురల్ స్టార్ నాని (Natural Star Nani)తో అనౌన్స్ చేసిన బ్లడీ రోమియో ముందొస్తుందా? ఈ ప్రశ్నలకు క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం సుజిత్ చేతిలో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ-2’, మరొకటి నాని కాంబినేషన్‌లో డిఫరెంట్ యాక్షన్ డ్రామా ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo). ఈ రెండు సినిమాల స్క్రిప్ట్‌లను లైన్‌లో పెడుతూ వచ్చాడు సుజిత్. అయితే నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడంతో ‘బ్లడీ రోమియో’ సెట్స్ పైకి వెళ్లడం కాస్త ఆలస్యమవుతూ వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సుజిత్‌కు పిలుపు రావడం, వెంటనే సుజిత్ ఓజీ-2 స్క్రిప్ట్‌ను ఫైనల్ చేయడంతో... అందరూ ఓజీ-2 ముందే పట్టాలెక్కుతుందని భావించారు. మెగా అభిమానులు కూడా ‘ఓజీ-2’ అనౌన్స్‌మెంట్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూశారు. కానీ.. సీన్‌లో చిన్న ట్విస్ట్ పడింది. సుజిత్ ప్లానింగ్‌లో అనూహ్యమైన మార్పు వచ్చినట్లు సమాచారం.


రీసెంట్ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. సుజిత్ ఓజీ-2 కన్నా ముందే బ్లడీ రోమియోను సెట్స్ మీదికి తీసుకెళ్లేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాడట. దీనికి సంబంధించి ఒక పక్కా ప్లాన్ కూడా రెడీ అయిపోయింది. నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్ ఈ సెప్టెంబర్ నాటికి దాదాపు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వెంటనే.. అస్సలు లేట్ చేయకుండా, అక్టోబర్ నుంచే ‘బ్లడీ రోమియో’ షూటింగ్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేయాలని సుజిత్ డిసైడ్ అయ్యాడట. అంతేకాదు, నాన్-స్టాప్‌గా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలనే టార్గెట్‌తో టీమ్ పనిచేస్తోంది. ఈ గ్యాప్‌లోనే సుజిత్ ‘ఓజీ-2’ ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా పూర్తి చేయనున్నాడని తెలుస్తోంది. ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే, సుజిత్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా ‘ఓజీ-2’ను భారీ స్థాయిలో సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ‘బ్లడీ రోమియో’కి సంబంధించిన ప్రీ-గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో పాటు, ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసింది. మరి సుజిత్‌ ఈసారి ఎలాంటి మ్యాజిక్‌ చేస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:

‘చింటూ’ వెనుక కథేంటని అడిగిన యాంకర్‌కు నాగవంశీ క్రేజీ ఆన్సర్!

ఆ సెంటిమెంట్ రిపీట్! రవితేజ కంబ్యాక్ ఖాయమా?

వరుస ఆఫర్లు.. మళ్లీ DSP ఫామ్‌లోకి వచ్చేసినట్టేనా?

Updated Date - Aug 04 , 2026 | 07:21 PM