నటసింహం బాలయ్యకు శుభాకాంక్షల వెల్లువ

ABN , Publish Date - Jun 10 , 2026 | 01:42 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులెందరో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Nandamuri Balakrishna Birthday Special

నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు (Happy Birthday NBK) సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులెందరో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆరు పదులు దాటితే వయసు మళ్ళింది అంటారు. కానీ, బాలయ్య మాత్రం యంగ్ హీరోగా సాగిన రోజుల్లో చూపిన ఉత్సాహమే ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు. వరుస సక్సెస్‌లతో తిరుగులేని హీరోగా ఈ ఏజ్‌లోనూ దూసుకుపోతున్న బాలయ్య, అదే ఎనర్జీతో వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఆల్రెడీ సైన్ చేశారు. ఇంకా యంగ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు పొలిటికల్‌గానూ తన సక్సెస్ స్టామినాను ప్రదర్శిస్తున్నారు. అలాంటి బాలయ్య మరిన్ని సక్సెస్‌లు సాధించాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు కోరుకుంటున్నారు.


సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నవరస నటనా సార్వభౌముడు, తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు దివ్య ఆశీస్సులు మీపై కలకాలం ఉండాలని కోరుకుంటూ మరొక్క మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు


ప్రముఖ కథానాయకుడు, హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కథానాయకుడిగా మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను. - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

నిండైన తెలుగుదనం..అభిమానం.. భోళాతనానికి ప్రతిరూపం మా బాలా మావయ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. అభిమానుల పాలిట గాడ్ ఆఫ్ మాసెస్, క్యాన్సర్ బాధితులకు సాంత్వన చేకూర్చే ఆపన్న హస్తం, హిందూపురం ప్రజా విజేత బాలా మావయ్య ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. - ఏపీ ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్

నాన్న గారి తరువాత విభిన్న పాత్రలు పోషించగల నటులు, కథానాయకుడి గానే కాకుండా నాయకుడిగా కూడా తన ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న తమ్ముడు బాలకృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. - దగ్గుబాటి పురంధేశ్వరి


ఇవి కూడా చదవండి:

భారతీరాజా ‘సీతాకోకచిలుక’ హ్యాపీ ఎండింగ్‌కి కారణమిదే: ఏడిద రాజా

భారతీరాజా మృతికి ప్రముఖుల నివాళి

‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!

బాలయ్య అన్‌స్టాపబుల్ జోష్

Updated Date - Jun 10 , 2026 | 01:51 PM