సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Namitha: అమ్మ క్యాన్సర్ తో చనిపోవాలి.. నీచమైన కామెంట్స్ చేశారు

ABN, Publish Date - May 27 , 2026 | 05:56 PM

అందాల తార నమిత (Namitha) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జెమిని సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నమిత ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, సింహా లాంటి సినిమాలతో తెలుగువారికి మరింత దగ్గరయింది.

Namitha

అందాల తార నమిత (Namitha) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జెమిని సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నమిత ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, సింహా లాంటి సినిమాలతో తెలుగువారికి మరింత దగ్గరయింది. ఇక అమ్మడి అందానికి తమిళ తంబీలు ఏకంగా గుడి కూడా కట్టారు అంటే ఆమెకున్న క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఈ చిన్నది తెలుగు అబ్బాయి అయిన వీరేంద్ర చౌదరిని వివాహమాడి సెటిల్ అయ్యింది.


ఇక నమిత బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ షో వలన తాను చాలా ఇబ్బందికి గురైనట్లు ఆమె లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ షో నిజం అనుకోని.. సోషల్ మీడియాలో తనను నీచంగా తిట్టారని, నేను, నా కుటుంబం నాశనమవ్వాలని కోరుకున్నట్లు తెలిపింది. ఆ ట్రోల్స్ ని తాను తట్టుకోలేకపోయాను అని.. అప్పుడు చాలా ఏడ్చేదాన్ని అని చెప్పింది.


'నీ అమ్మ క్యాన్సర్‌తో చనిపోవాలి, నీ పిల్లలు, పెంపుడు జంతువులు కూడా చనిపోవాలి అంటూ తిట్టారు. మొదట ఈ కామెంట్స్ చూసి నేను చాలా ఏడ్చాను. అసలు ఎందుకు వీరు ఇలా తిడుతున్నారు. అసలు టీవీలో రోజుకు కనిపించే ఆ ఒకటిన్నర గంటల ఎడిటెడ్ షోను చూసి.. లోపల జరిగే 24 గంటల రియాలిటీని, ఒకరి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఒక మనిషిని ట్రోల్ చేస్తున్నాం అంటే మొదట వారి స్థానంలో ఉండి ఆలోచించండి. ఇలా ట్రోల్ చేసేవారికి నేను ఒకటే చెప్తున్నాను. నా జోలికి వస్తే ఊరుకొంటాను ఏమో కానీ, నా పిల్లలు, ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను' అంటూ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం నమిత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి:

మిస్టర్ మిడిల్ క్లాస్ కష్టాలు.. చూడడం చాలా కష్టం గోవిందా..

అనిల్ రావిపూడి, రామ్ కాంబో.. సంక్రాంతి సెంటిమెంట్‌కు బ్రేక్?

భానుడి భగభగ.. భామ‌లు స‌ల‌స‌ల! కుర్ర‌కారు విలవిల!!

Updated Date - May 27 , 2026 | 06:22 PM