మిస్టర్ మిడిల్ క్లాస్ కష్టాలు.. చూడడం చాలా కష్టం గోవిందా..

ABN , Publish Date - May 27 , 2026 | 04:58 PM

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ (Srikanth) ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి స్టార్ హీరోల సినిమాల్లో మంచి పాత్రలను అందుకుంటున్నారు.

Mister Middle Class

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ (Srikanth) ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి స్టార్ హీరోల సినిమాల్లో మంచి పాత్రలను అందుకుంటున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రం మిస్టర్ మిడిల్ క్లాస్ (Mister Middle Class). జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను జికె, సీఎన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్ సరసన లయ నటిస్తోండగా.. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) గోవిందుడిగా కనిపించబోతున్నారు.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మిస్టర్ మిడిల్ క్లాస్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కథ విషయానికొస్తే.. వెంకట రమణ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. ఉమ్మడి కుటుంబం.. నిత్యం గోవింద నామం తప్ప ఇంకో మాట ఎరుగని మనిషి. చాలీచాలని జీతంతోనే జీవితాన్ని నెట్టుకుంటూ వస్తాడు. తన కష్టాలను తీర్చమని గోవిందుడిని కోరుకుంటూ ఉంటాడు. మిడిల్ క్లాస్ కష్టాల మధ్యలో నలిగిపోతున్న సమయంలో అనుకోకుండా ఒక క్రైమ్ లో ఇరుక్కుంటాడు. దానివలన అతని జీవితం చిన్నాభిన్నమవుతుంది. మరి తన పరమ భక్తుడిని కాపాడుకోవడానికి గోవిందుడు భూమి మీదకు వచ్చాడా.. ? వెంకట రమణ జీవితాన్ని మార్చాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


టాలీవుడ్ లో మిడిల్ క్లాస్ కష్టాలు చూపించిన ప్రతి సినిమా హిట్ టాక్ అందుకుంది. ఇది కూడా హిట్ అందుకునేలానే కనిపిస్తోంది. మిడిల్ క్లాస్ వ్యక్తిగా శ్రీకాంత్ చక్కగా సరిపోయారు. ఇక గోవిందుడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా కనిపించారు. పౌరాణిక పాత్రలు చేయడం ఆయనకేమి కొత్త కాదు. ఈ మధ్య కాలంలో వెంకటేశ్వర స్వామి లుక్ చాలా న్యాచురల్ గా కనిపించింది రాజేంద్రుడుకే అని చెప్పొచ్చు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో శ్రీకాంత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

డాన్ 3 వివాదం.. రూ. 45 కోట్ల సెటిల్‌మెంట్ ఫెయిల్

Rana Daggubati: పాములు, మొసళ్ళను కూడా తింటాను..

మంచు మనోజ్ గొప్ప మనసు.. అడిగిన వెంటనే విరాళం

Updated Date - May 27 , 2026 | 05:23 PM