అరేయ్ ఏం బిగ్ బాస్ రా బాబు.. చిరాకొచ్చేస్తుంది
ABN, Publish Date - Oct 06 , 2026 | 06:44 PM
బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 10. ఇప్పటివరకు జరిగిన అన్నీ సీజన్స్ లో కన్నా ది వరస్ట్ సీజన్ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. హౌస్ లో వాతావరణం రోజూ రోజుకీ మరీ వేడెక్కిపోతోంది.
బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ తెలుగు సీజన్ 10. ఇప్పటివరకు జరిగిన అన్నీ సీజన్స్ లో కన్నా ది వరస్ట్ సీజన్ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. హౌస్ లో వాతావరణం రోజూ రోజుకీ మరీ వేడెక్కిపోతోంది. ముఖ్యంగా త్రిగున్, రోహిత్, ముకేష్, అమన్ మధ్య జరుగుతున్న గొడవలు అసలు తగ్గడం లేదు. ఒకరినొకరు కించపరుస్తూ మాట్లాడటం, వ్యక్తిగత దూషణలకు దిగడం రోజువారీ రచ్చగా మారింది. సాధారణ సంభాషణల్లో కూడా తీవ్రమైన బూతులు వాడుతూ హౌస్‌లోని మిగతా సభ్యులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు.
నామినేషన్ల ప్రక్రియ వచ్చిందంటే చాలు, ఈ నలుగురి మధ్య గొడవలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఒకరినొకరు నెట్టుకోవడం, భౌతికంగా దాడులు చేసుకునేంత వరకు వెళ్లిపోవడం చూస్తుంటే ఏ క్షణంలో ఏమవుతుందో అని భయమేస్తోంది. ఒకరి తప్పులను మరొకరు వేలెత్తి చూపుతూ, తీవ్రంగా రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్ల చిన్న గొడవ కూడా పెద్ద వివాదంగా మారుతోంది. గేమ్ గెలవడం కోసం ఎంతటి స్థాయికైనా దిగజారడానికి సిద్ధపడటం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు షాలిని, అపూర్వ ప్రవర్తన కూడా ప్రేక్షకులకు, హౌస్‌మేట్స్‌కు తీవ్ర విసుగు తెప్పిస్తోంది. ప్రతి చిన్న విషయానికి వీరు చేసే అతి, ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లు అస్సలు సహజంగా లేవు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ, ప్రశాంతంగా ఉన్న చోట కూడా డ్రామా సృష్టిస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి వీరు చేస్తున్న ఈ అతి వల్ల హౌస్‌లో అసలు గొడవలకు మరింత నెగెటివిటీ తోడవుతోంది.
ఈ ఇద్దరి అతి ప్రవర్తన, ఆ నలుగురి భౌతిక దాడుల దాకా వెళ్లే గొడవలు కలిసి బిగ్ బాస్ హౌస్‌ను రణరంగంగా మార్చేశాయి. నిజమైన గేమ్, స్ట్రాటజీల కంటే కూడా ఈ నెగెటివ్ డ్రామా, నోటి దూల మాత్రమే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ప్రతి వారం నాగార్జున.. తీరు మార్చుకోండి అని చెప్తున్నా కూడా ఎవరిలో మార్పు రాకపోవడం విశేషం. ఒకప్పుడు బిగ్ బాస్ చూడాలంటే కొద్దోగొప్పో ఆసక్తి చూపించేవారు కూడా ఈ సీజన్ చూసి అసళ్ళు ఏం బిగ్ బాస్ రా బాబు.. చిరాకొచ్చేస్తుంది అంతో నెత్తి పట్టుకుంటున్నారు. గేమ్ కాకుండా వ్యక్తిగత దూషణ చేసుకోవడానికే టైమ్ సరిపోతుంది. నామినేషన్ లో ఒక్కరూ కూడా సరైన పాయింట్స్ పెట్టరు అని చెప్పుకొస్తున్నారు. ఇకనుంచి ఈ కామనర్స్ ని కాకుండా కేవలం సెలబ్రిటీలను మాత్రమే తీసుకోవాలని నాగార్జునకు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
The Traitors Telugu: బిగ్ బాస్ కన్నా వీళ్లే బావున్నారుగా
Jailer 2: వర్మ లేని లోటు తెలుస్తుందే..
చరణ్ - సుకుమార్ మూవీ మైథాలజీ కథతోనా..?