దూత 2 .. రంగంలోకి మహేష్ హీరోయిన్
ABN , Publish Date - Jun 09 , 2026 | 09:07 PM
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఒకవైపు భారీ పీరియాడికల్ యాక్షన్ వృష కర్మలో నటిస్తూనే, మరోవైపు తన కెరీర్‌లో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దూత (Dhootha) ఓటీటీ సిరీస్ రెండో సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు.
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఒకవైపు భారీ పీరియాడికల్ యాక్షన్ వృష కర్మలో నటిస్తూనే, మరోవైపు తన కెరీర్‌లో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దూత (Dhootha) ఓటీటీ సిరీస్ రెండో సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన దూత తొలి సీజన్ హారర్, మిస్టరీ, సస్పెన్స్ అంశాల కలయికతో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది.
దూత సక్సెస్‌తో నాగ చైతన్యకు డిజిటల్ వరల్డ్‌లో సరికొత్త గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఇప్పటికే అధికారికంగా ప్రారంభమైన దూత 2 పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ రెండో సీజన్‌ను మొదటి భాగం కంటే మరింత భారీ స్థాయిలో, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.ఇక ఈ క్రమంలోనే దూత 2 కాస్టింగ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతోంది.
ఇక ఈ క్రేజీ సిరీస్‌లో ప్రముఖ సీనియర్ నటి భూమిక చావ్లా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, కథను మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే ఆమె కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. గతంలో 2018లో వచ్చిన సవ్యసాచి సినిమాలో నాగ చైతన్య, భూమిక కలిసి నటించారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత దూత 2 ద్వారా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుండటంతో ప్రేక్షకుల్లో సరికొత్త ఆసక్తి నెలకొంది. ఆమె క్యారెక్టర్ ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్‌లో ఆ ముగ్గురు
Peddi: గురువు సుకుమార్‌లా బ్యాలెన్స్ చేయలేకపోయిన బుచ్చి!