ఏపీ సీఎం చంద్రబాబుని కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ!

ABN , Publish Date - Apr 17 , 2026 | 08:23 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ లను కలిసి తన వివాహానికి ఆహ్వానించారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి వివాహ పత్రికను అందించారు.

Bellamkonda Family meets AP CM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh)లను కలిసి తన వివాహానికి ఆహ్వానించారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas). తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి వివాహ పత్రికను అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి (Kavya Reddy) నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహ వేడుక ఏప్రిల్ 29న తిరుమల శ్రీవారి సన్నిధిలో జరగనుంది.


Bellamkonda-Sreenivas-meets.jpg

నిశ్చితార్థం విషయానికి వస్తే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్‌ శంకర్‌పల్లిలోని ఓ విశాలమైన ఫామ్‌హౌస్‌లో ఇటీవలే గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ఆ ఫ్యామిలీ మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు. నిశ్చితార్థ వేడుకలో సాయి- కావ్య జంట తమ ప్రత్యేక బంధాన్ని ప్రతిబింబించేలా కస్టమైజ్డ్ జువెలరీని ధరించారు. ఆ అందాన్ని మరింత పెంచుతూ వారి ఎంగేజ్‌మెంట్ లుక్స్‌ను ఢిల్లీకి చెందిన ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అభిషేక్ శర్మ డిజైన్ చేశారు. వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అభిమానులు, నెటిజన్లు సాయి- కావ్య జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహ వేడుకకు ‘శ్రీనివాసకావ్యాణం’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ‘శ్రీనివాసకావ్యాణం’కు సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్‌గానే పసుపు వేడుకను గ్రాండ్‌గా ముగించారు.

ఇవి కూడా చదవండి:

Balakrishna: ‘రూటు’ మార్చిన బాలయ్య.. కొడుకు కథను పక్కన పెట్టి.. తనే ఆ దర్శకుడితో?

Rashmika Mandanna: రష్మికకు పిచ్చెక్కించేశారట.. పోస్ట్ వైరల్!

మంగ్లీకి మరో షాక్ ఇచ్చిన అడ్వొకేట్‌ సుబ్బారావు.. ఈ ట్విస్ట్ ఏంటయ్యో!

Updated Date - Apr 17 , 2026 | 08:23 PM

Bellamkonda Sai Srinivas: అమ్మాయి అదృశ్యం వెనుక..?

Bellamkonda Sreenivas: భ‌గ‌వంత్ కేసరి సినిమా ప్రోడ‌క్ష‌న్‌లో బెల్లంకొండ‌.. అదిరిపోయిన ఫ‌స్ట్ లుక్‌

Bellamkonda Sreenivas: యాక్షన్-ఓరియెంటెడ్ - కంటెంట్-డ్రైవెన్ కథలతో.. 

మంచి మాస్‌ రోల్‌ చేశాను

Bellamkonda Sreenivas: బెల్లంకొండ పదో సినిమా హీరోయిన్ ఎవరంటే!