సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'రణబాలి' వెడ్డింగ్ పోస్టర్.. దీని వెనుక ఇంత పెద్ద క‌థ ఉందా?

ABN, Publish Date - Mar 01 , 2026 | 09:11 PM

టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంట అంటే అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్. ఏ ముహుర్తానా గీతా గోవిందం సినిమా చేశారో గానీ నాటి నుంచి వీరు నిత్యం వార్త‌ల్లో నిలుస్తూనే వ‌స్తున్నారు.

Ranabaali

టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న ( Rashmika) జంట అంటే అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్. ఏ ముహుర్తానా గీతా గోవిందం సినిమా చేశారో గానీ నాటి నుంచి వీరు నిత్యం వార్త‌ల్లో నిలుస్తూనే వ‌స్తున్నారు. ఇటీవ‌ల పెళ్లి కూడా చేసుకుని వైవాహిక జీవితంలోకి ప్ర‌వేశించారు. ఇప్ప‌టివ‌ర‌కు వీరిద్ద‌రి కాంబోలో రెండు చిత్రాలు రాగా అందులో గీతా గోవిందం ఘన విజయాన్ని అందుకోగా, డియర్ కామ్రేడ్ ఫ‌ర్వాలేద‌నిపించుకుని క్లాసిక్ జాబితాలో చేరిపోయింది.

ఇప్పుడు ఈ ఇద్దరూ మరోసారి తెరపై కలుస్తూ ‘రణబాలి’ (Ranabaali) అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయి చ‌కచ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చేందుకు సిద్ధం అవుతోంది. కాగా గ‌తంలో విజ‌య్‌తో టాక్సివాలా, నానితో శ్యామ్ సింగ‌రాయ్ వంటి సినిమాలు తెర‌కెక్కించిన రాహుల్ సాంకృత్యన్ (Rahul Sankrityan) ఈ సినిమాను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. ఈక్ర‌మంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన గ్లింప్స్ సినిమా ఎలా ఉండ‌బోతుంది రుచి చూపించి మంచి బ‌జ్ క్రియేట్ చేసింది.

1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతుండ‌గా రణబాలి పాత్రలో విజయ్ కనిపించగా, జయమ్మ పాత్రలో రష్మిక నటిస్తున్నారు. అయితే ఇటీవ‌లే విజ‌య్ , ర‌ష్మిక పెళ్లి చేసుకున్న నేప‌త్యంలో ఈ సినిమా నుంచి ఓ వెడ్డింగ్ సాంగ్‌తో పాటు ప్రత్యేక పెళ్లి పోస్టర్ విడుద‌ల చేయ‌గా సోషల్ మీడియాలో విప‌రీత్ంగా వైరల్ అవుతోంది. తాజాగా.. ఈ వెడ్డింగ్ పోస్టర్ వెనుక కథను ద‌ర్శ‌కుడు రాహుల్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఇది మాములు ఫొటో కాద‌ని నిజ‌మైన ఒక నాటి జీవిత క్ష‌ణాల‌కు తార్కానం అని కొనియాడారు. నాకు చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు, పూర్వీకుల పాత ఫోటోలంటే మక్కువ ఎక్కువ‌ అని, ఆ కాలం చిత్రాల్లో కనిపించే సహజత్వం, అమాయకత్వం తనను ఎప్పుడూ ఆకట్టుకునేవ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో నాటి పాత మ‌ధుర జ్ఞాప‌కాల‌ను ‘రణబాలి’లో ప్రతిబింబించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. షూటింగ్ రోజున పెళ్లి వేషధారణలో విజయ్, రష్మిక సెట్లోకి వచ్చిన క్షణం అక్క‌డ‌ వాతావరణం మారిపోయిందని ఆయన పేర్కొన్నారు.

ఎలాంటి ప్రత్యేక లైటింగ్ లేకుండా, స్టైలిష్ పోజులు లేకుండా సాధారణ నేపథ్యంతో ఆ దృశ్యాన్ని చిత్రీకరించామని చెప్పారు. ఆ ఫోటో చూస్తే అది సినిమా స్టిల్ అనిపించకుండా, గత కాలంలో జరిగిన నిజమైన వివాహం జ్ఞాపకంలా అనిపిస్తుందని అన్నారు. కాలాన్ని మరిపించే బంధం, జీవితాన్ని తాకే అనుభూతి – ఇదే ‘రణబాలి’ కథలోని ప్రధాన భావమని దర్శకుడు భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతూ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. మీరూ ఈ ఫొటోల‌పై ఓ లుక్ వేయండి మ‌రి.

Updated Date - Mar 01 , 2026 | 10:07 PM