రవితేజ వదిలిన ‘బ్యాండ్ మేళం’ సెకండ్ సింగిల్
ABN, Publish Date - Feb 28 , 2026 | 07:25 PM
‘కోర్ట్’ చిత్రం తర్వాత హర్ష్ రోషన్(Harsh Roshan), శ్రీదేవీ (Sridevi) మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యాండ్ మేళం’ (Band Melam).
‘కోర్ట్’ చిత్రం తర్వాత హర్ష్ రోషన్(Harsh Roshan), శ్రీదేవీ 9Sridevi) మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యాండ్ మేళం’ (Band Melam). రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 13న రిలీజ్ చేయబోతోన్నారు. ఇటీవల విడుదల చేసిన ‘తిప్పూ కుంటానవ్’ అనే పాట ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
అలాగే టీజర్ కూడా విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేశారు. ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ అంటూ సాగే మెలోడీ పాటను మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. అనంతరం రవితేజ ‘బ్యాండ్ మేళం’ టీంకి బెస్ట్ విషెస్‌ను తెలియజేశారు. విజయ్ బుల్గానిన్ క్యాచీ ట్యూన్‌ను అందించారు. చంద్రబోస్ సాహిత్యం ఎంతో అర్థవంతంగా ఉంది. శ్వేతా మోహన్ ఆలపించారు.