Balakrishna: సంక్రాంతి రేసులో బాలయ్య సినిమా! దర్శకుడెవరో తెలుసా?

ABN , Publish Date - Apr 11 , 2026 | 06:24 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటిస్తూ, ఒక చిత్రం షూటింగ్‌లో ఉండగానే మరో రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ కుర్ర హీరోలకు సైతం సవాల్ విసురుతున్న విషయం తెలిసిందే.

Nandamuri Balakrishna

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటిస్తూ, ఒక చిత్రం షూటింగ్‌లో ఉండగానే మరో రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ కుర్ర హీరోలకు సైతం సవాల్ విసురుతున్నారు. ఇటీవలి కాలంలో ఆయన ఎంచుకుంటున్న కథలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటుండటంతో, ఆయన తదుపరి చిత్రాలపై ఇండస్ట్రీలోనూ.. అలాగే ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి విలక్షణమైన సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో బాలయ్య ఒక పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు టాక్. ఈ కాంబినేషన్ కుదిరినప్పటి నుంచి అటు అభిమానుల్లోనూ ఇటు సినీ వర్గాల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా సాగుతున్నాయట. కథా చర్చలు ముగిసి, నటీనటుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం. బాలయ్య తన తదుపరి సినిమాల షెడ్యూల్స్ విషయంలో చాలా పక్కాగా వ్యవహరిస్తున్నారు. సమయం వృధా కాకుండా, ఒక్కో ప్రాజెక్టును లైన్‌లో పెడుతూ తన జోరును కొనసాగిస్తున్నారు. విజయ్ కనకమేడల సినిమా సెట్స్ పైకి వెళ్లేలోపు, అంతకంటే ముందే ఓకే అయిన గోపీచంద్ మలినేని (Gopichand Malineni) చిత్రానికి సంబంధించి రెండు మూడు కీలకమైన షెడ్యూల్స్‌ను పూర్తి చేయాలని బాలయ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల రెండు సినిమాలు సమాంతరంగా పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. షూటింగ్ పనుల్లో ఎక్కడా విరామం లేకుండా ప్లాన్ చేయడం ద్వారా అనుకున్న సమయానికి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.


సాధారణంగా సంక్రాంతి సీజన్ అనేది సక్సెస్‌ల సీజన్ అని సినిమా వాళ్లకి ఎరుకే. అందులోనూ బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ (Sankranthi Sentiment) చాలా బాగా వర్కవుట్ అవుతుంది. అందుకే విజయ్ కనకమేడల సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. గోపీచంద్ మలినేని సినిమా కూడా ఈ లోపే సిద్ధం కానుంది. విజయ్ కనకమేడల మార్క్ ఇంటెన్సిటీతో పాటు బాలయ్య మాస్ ఇమేజ్ తోడైతే థియేటర్లలో రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

Jailer 2: షారుఖ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్.. బాబోయ్, ఈ వార్త నిజమైతేనా?

దయచేసి రూ.16 కోట్లు సాయం చేయండి: నందమూరి బాలకృష్ణ

‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్

నిర్మాతని చితక్కొట్టిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్!

Updated Date - Apr 11 , 2026 | 06:24 PM

BalaKrishna : ఆ ఆలోచన నుంచే డాకు మహరాజ్‌ కథ పుట్టింది

Balakrishna : బోయపాటితో చెడిందా!?

Balakrishna Nandamuri: వారి అభ్యర్థనను అంగీకరించి.. సన్మానానికి ఓకే చెప్పిన బాలయ్య

Balakrishna Favourite Heroines: బాలయ్య ఫేవరెట్ హీరోయిన్లు ఎవరో తెలుసా..

Balakrishna: 'హిట్ 4'లో హీరోగా బాలయ్య?