సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాలయ్య లేకుండానే షూటింగ్.. కొరటాల ప్లానేంటి?

ABN, Publish Date - Jul 27 , 2026 | 07:45 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన కొరటాలతో చేయనున్న సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.

NBK112 Update

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గత ఏడాది చివర్లో ‘అఖండ-2’తో అలరించిన ఆయన, ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK 111’ చిత్రంలో నటిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీలో మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో ఊహించని విధంగా బాలకృష్ణకు గాయం కాగా, ఏఐజీ (AIG) హాస్పిటల్స్ వైద్యులు ఆయనకు విజయవంతంగా సర్జరీ చేశారు. దీంతో ప్రస్తుతం ‘NBK 111’ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.


గోపీచంద్ మలినేని చిత్రంతో పాటు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రానికి (NBK112) శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గత నెలలోనే ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. అయితే, బాలయ్యకు గాయం కావడంతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా వాయిదా పడిందని తెలుస్తోంది. మొదట ఆగస్టు చివరి వారంలో కీలకమైన షెడ్యూల్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేసినప్పటికీ, బాలయ్యకు బెడ్ రెస్ట్ అవసరం కావడంతో షూట్‌ను సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా వేశారట. అయితే కొరటాల శివ ముందుగా బాలకృష్ణ లేని సన్నివేశాలను చిత్రీకరించి, ఆయన పూర్తిగా కోలుకున్నాక బాలయ్య సీన్లను ప్లాన్ చేయాలని నిర్ణయించారని సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణను కొరటాల శివ పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించబోతున్నారని టాక్. మాస్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగేలా విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని సిద్ధం చేశారు. ‘దేవర’ వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో కథపై ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో నటి ఐశ్వర్య రాజేష్ ఒక కీలక పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాకుండా ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నారనే టాక్ నడుస్తుండగా, దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


ఇక​ గతంలో బాలకృష్ణ నటించిన ఆల్ టైమ్ హిట్ ‘సింహా’ చిత్రానికి కొరటాల శివ రచనా సహకారాన్ని అందించి, పవర్‌ఫుల్ డైలాగులు రాశారు. ఇప్పుడు స్వయంగా ఆయన దర్శకత్వంలోనే ఈ సినిమా రూపుదిద్దుకుంటుండటంతో, దీనిని కూడా ‘సింహా’ రేంజ్‌లోనే తెరకెక్కించాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. శక్తివంతమైన కథ, కొరటాల మార్క్ ఎమోషన్స్, బాలయ్య పవర్‌ఫుల్ మాస్ మేనియాల కలయికగా రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

యాక్టింగ్‌లోకి దిగిన దర్శకుడు.. ‘అనకాపల్లి’ ట్రైలర్ ఎలా ఉందంటే

అనిల్ రావిపూడి కోసం నిర్మాతలు క్యూ.. ‘పెద్ది’ సారూ?

మరీ ఈ రేంజ్‌లోనా.. ఆదర్శకుటుంబం వెంకీ పాత్ర రివీల్

Updated Date - Jul 27 , 2026 | 07:45 PM