సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

గ్యాంగ్‌స్టర్ డ్రామానే కాదు.. ‘దాదా’లో అసలు హైలైట్ అదే!

ABN, Publish Date - Sep 19 , 2026 | 02:16 PM

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన ‘దాదా’ సినిమా చేస్తున్నారు.

Dada Balayya

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఆయన ‘దాదా’ (Dada) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లింప్స్ చూస్తుంటే.. మరోసారి బాలయ్య బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమనిపిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో మరో హైలైట్ ఏంటంటే.. మంచు మనోజ్ ఒక అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. తెరపై బాలయ్య, మనోజ్ ముఖాముఖి తలపడే సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.


గ్యాంగ్‌స్టర్ డ్రామానే కాదు..

ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా ‘దాదా’కి సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా 1980ల నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. అయితే ఇది కేవలం ఫుల్ యాక్షన్‌తో కూడిన చిత్రం మాత్రమే కాదట. ప్రేక్షకుల మనసులను హత్తుకునే అత్యంత భావోద్వేగభరితమైన కుటుంబ కథ కూడా ఇందులో ఉందని సమాచారం. అంటే ఒకవైపు కళ్లు చెదిరే మాస్ యాక్షన్, మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసే ఎమోషన్స్ ఉంటాయని టాక్. అంటే ఇందులో బాలయ్యను రెండు విభిన్న కోణాల్లో చూడబోతున్నారన్నమాట.


షూటింగ్ ఎంత వరకు వచ్చిందంటే..

ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య – థమన్ కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే. గతంలో వీరి కలయికలో వచ్చిన చిత్రాలలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో సంచలనం సృష్టించాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘దాదా’ కోసం కూడా థమన్ నెక్స్ట్ లెవల్ బీజీఎమ్‌ను సిద్ధం చేస్తున్నారట. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ సినిమా యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా బాలకృష్ణకు గాయం కావడం, దానికి సర్జరీ జరగడంతో వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని, త్వరలోనే ‘దాదా’ షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమా టాకీ పార్ట్ చివరి దశకు చేరుకుందట. కేవలం 20 నుంచి 25 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ఏడాది డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘దాదా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే.. అందుకు కారణం విజయ్ అన్నే: అట్లీ

ఐదు కాదు.. టాలీవుడ్ సినిమాకు మరో మూడు కావాలి

యాక్షన్‌, హర్రర్‌ చిత్రాలకు ఏమాత్రం తేడా లేదు: దర్శకుడు

Updated Date - Sep 19 , 2026 | 02:16 PM